ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ లో మార్పులు..

తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. 2026 మార్చి 3న జరగాల్సిన ఇంటర్మీడియట్​ సెకండియర్ బోటనీ, మ్యాథ్స్ 2 ఏ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను తరువాతి రోజు అంటే మార్చి 4న నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. మార్చి 3న హోలీ పండగ ఉన్న నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు వెల్లడించింది. ఇక మిగతా పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

తెలంగాణలోని ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మరుసటి రోజు అనగా మార్చి4న నిర్వహించనునున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మార్చి 3వ తేదీన హోలీ పండగ ఉన్న నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పు చేసినట్లు వివరించింది.

ఇక మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. ఇక తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 న ప్రారంభం కానున్నాయి. 25న ఫస్ట్ ఇయర్, 26వ తేదీన సెకండియర్ పరీక్షలు స్టార్ట్ కానున్నాయి. మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి.

TS Inter Exams Update Botany Maths 2A amp amp Political Science Papers Shifted to March 4 Due to Holi

రోజుకు రెండు సెషన్ల చొప్పున రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. అలాగే ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రతి రోజూ 2 షిఫ్టుల్లో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 వరకు అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+