వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కొలువుల జాతర.. పంజాయతీరాజ్‌శాఖలో పోస్టులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోలకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పంచాయతీరాజ్ శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు ఊరట కలిగినట్లైంది. ఈ పోస్టులన్నీ గెజిటెడ్ హోదావి కాగా.. గ్రూపు-1 ర్యాంకు స్థాయి అధికారుల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది.

పంచాయతీరాజ్ శాఖలో వివిధ విభాగాల్లో పోస్టులు మంజూరు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. దాదాపు 311 పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలో చేపడుతామని వివరించింది.

ts panchayatiraj vacancies to be filled

చీఫ్ ఎగ్జిక్యూటివ్ 23, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పోస్టు 23, జిల్లా పంచాయతీ అధికారి 23, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు 101, మండల పంచాయతీ అధికారులు 101 పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కొలువులను టీఎస్ పీఎస్సీ లేదంటే పంచాయతీరాజ్ శాఖ భర్తీ చేస్తుందనే అంశంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దాదాపు ఈ పోస్టులన్నీ గెజిటెడ్ హోదావి కావడం విశేషం. గ్రూపు-1 ర్యాంకు స్థాయి అధికారుల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది.

English summary
Good news for the unemployed youth in Telangana.The Panchayati Raj department has said that it will replace jobs in various departments. While all these posts are gazetted status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X