టీఎస్‌సీఏబీ రిక్రూట్‌మెంట్ 2017: 96 పోస్టుల కోసం అప్లై చేస్కోండిలా..

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో 41 మేనేజర్ పోస్టులు, 55 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్:96 ఖాళీ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌సీఏబీ రిక్రూట్‌మెంట్ 2017

వివరాలు:తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో 41 మేనేజర్ పోస్టులు, 55 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 22, 2017 నుంచి మార్చి మార్చి 04, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ పేరు: తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్

పోస్టు వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్, మేనేజర్

పోస్టింగ్: హైదరాబాద్(తెలంగాణ)

మేనేజర్: 41 ఖాళీలు

విద్యార్హత: టీఎస్‌సీఏబీలో మేనేజర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా కామర్స్‌లో 55శాతం మార్కులతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

జీతం: నెలకు రూ.. 23,700- 42,020/-

స్టాఫ్ అసిస్టెంట్: 55 ఖాళీలు

TSCAB Recruitment 2017 Notification 96 Various Vacancies

విద్యార్హత: టీఎస్‌సీఏబీలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

జీతం: నెలకు రూ. 11,765- 31,540/-

వయో పరిమితి: జనవరి 1, 2017 వరకు 20 నుంచి 28ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్ల వెసులుబాటు. ఓబీసీలకు 3ఏళ్ళు, పీడబ్ల్యడీలకు 10ఏళ్ల వెసులుబాటు ఉంది.

ఎంపిక ప్రక్రియ: స్టాఫ్ అసిస్టెంట్ పోస్టు కోసం పోటీ పడే అభ్యర్థులకు ఆన్‌లైన్ టెస్ట్ కోసం టీఎస్‌సీఏబీ అడ్మిట్ కార్డ్ 2017 జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది.

టీఎస్‌సీఏబీ 2017 ఖాళీ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి మార్చి 04 2017 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు, నోటిఫికేషన్ వివరాల కోసం సంప్రదించండి: https://goo.gl/hPSZHd

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+