TSPSC పరీక్షల కొత్త తేదీలొచ్చేశాయ్

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఉదంతం.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం. రాజకీయంగా పెను దుమారానికి దారి తీసిందీ ఘటన. వేలాదిమంది నిరుద్యోగులను నిరాశలో ముంచెత్తింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కారణంగా పరీక్షలు కూడా రద్దయ్యాయి. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ కొనసాగిస్తోన్నారు.

ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ సహా ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తోన్న పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వందకు వంద 100 మార్కులు సాధించిన.. 20 మంది అభ్యర్థుల నుంచి కూడా సిట్ అధికారులు వివరాలను రాబట్టుకున్నారు.

TSPSC

అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రాలను లీకేజీ కేసులో నిందితులు డాక్యానాయక్‌ను కీలక విషయాలను సేకరించారు. వారి నుంచి ఎవరెవరికి పేపర్లు వెళ్లాయనే విషయంపై ఆరా తీస్తోన్నారు. ఈ వ్యవహారం అటు రాజకీయంగా పెను దుమారానికి దారి తీసింది. అధికార భారత్ రాష్ట్ర సమితిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు రాజకీయ ప్రత్యర్థులు.

ఈ పరిణామాల మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అయిదు విభాలకు సంబంధించిన పరీక్షల కొత్త తేదీలను వెల్లడించారు. రీషెడ్యూల్ చేసిన తేదీల ప్రకారం- రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షలు జూన్ 28వ తేదీన జరుగనున్నాయి. నిజానికి- ఈ పరీక్ష ఈ నెల 23వ తేదీన జరగాల్సి ఉంది.

సహకార శాఖలో వ్యవసాయాధికారి పరీక్షను మే 25వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ పరీక్ష ఈ నెల 25వ తేదీన జరగాల్సి ఉంది. భూగర్భ జలవనరుల విభాగంలో వివిధ కేటగిరీల్లో గెజిటెడ్ అధికారుల ఖాళీలను భర్తీ చేయడానికి జులై 18, 19వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇదివరకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం- ఈ పరీక్షలు ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది.

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో భాగమైన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షలను మే 19వ తేదీన నిర్వహించేలా రీ షెడ్యూల్ చేసినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. గతంలో ఈ పరీక్షను మే 7వ తేదీన నిర్వహించాల్సి ఉండగా.. పేపర్ లీకేజీ ఉదంతం చోటు చేసుకున్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేసింది. తాజాగా మే 19వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది.

భూగర్భ జలవనరుల శాఖలోనే వివిధ నాన్- గెజిటెడ్ ఖాళీలను భర్తీ చేయడానికి జులై 20, 21 తేదీల్లో పరీక్షలను నిర్వహించనుంది టీఎస్‌పీఎస్సీ. నిజానికి- ఈ పరీక్షలను మే 15, 16 తేదీల్లో నిర్వహించాలని ఇదివరకు షెడ్యూల్ చేసింది. పేపర్ లీకేజీ వల్ల వీటిని జులై 20, 21 తేదీల్లో నిర్వహించేలా రీషెడ్యూల్ చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+