సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సీ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అగస్టు 22,2017 నుంచి సెప్టెంబర్ 15,2017వరకు దరఖాస్తు చేసుకోవాలి.
కమిషన్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
జాబ్ పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్
లొకేషన్: తెలంగాణ
ఖాళీలు: 205

విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన కాలేజీ నుంచి పీజీ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.40,270-రూ.93270/ఒక నెలకు
వయోపరిమితి: జులై1, 2017నాటికి 18-44ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 10ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అగస్టు 22,2017
తుది గడువు: సెప్టెంబర్ 15,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/dtrECR












Click it and Unblock the Notifications