తెలంగాణలో 35 శానిటరీ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణలో 35 శానిటరీ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగష్టు 30లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: శానిటరీ ఇన్స్‌పెక్టర్
జాబ్ లొకేషన్: తెలంగాణ
విద్యార్హతలు:
యూజీసీచే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుంచి బయాలజీ సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. లేదా భారత ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి శానిటరీ ఇన్స్‌పెక్టర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయస్సు: 1 జూలై,2018 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం: నెలకు రూ.22460- 66330/-
అప్లికేషన్ ఫీజు
ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము: రూ.200/-
ఎగ్జామినేషన్ ఫీజు: రూ. 80/-
తెలంగాణకు చెందిన బీసీ/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్‌మెన్/నిరుద్యోగులకు కేవలం పరీక్ష ఫీజు మాత్రమే
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వార ఎంపిక
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూలై 31,2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 30 ఆగష్టు, 2018
మరిన్ని వివరాలకు: www.tspsc.gov.in












Click it and Unblock the Notifications