తెలుగులోనూ టిఎస్‌పిఎస్సీ వెబ్‌సైట్: ఘంటా చక్రపాణి వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్‌ను తెలుగులోనూ రూపొందించనున్నట్లు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. ప్రస్తుతం ఆంగ్ల భాషలో ఉన్న వెబ్‌సైట్‌ను తెలుగులోనూ రూపొందించే బాధ్యతలను టీఎస్‌పీఎస్సీ సభ్యుడు మంగారి రాజేందర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

నిజామాబాద్‌లో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన సందర్భంలో మంగారి రాజేందర్ తెలుగులో తీర్పు వెలువరించి రికార్డు సృష్టించారు. మంగారి రాజేందర్ జింబో పేరుతో కవిత్వమూ కథలూ రాస్టుంటారు. ఈ నేపథ్యంలో కమిషన్ వెబ్‌సైట్‌ను తెలుగులో రూపొందించే బాధ్యతలు ఆ యనకు అప్పగించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
ఉద్యోగాల భర్తీలో పారదర్శకంగా వ్యవహరిస్తామని టీఎస్‌పీఎస్సీ కొత్త సభ్యులు టి.వివేక్, రామ్మోహన్‌రెడ్డి, డాక్టర్ క్రిష్ణారెడ్డి, సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం వారితో చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రమాణం చేయించారు.

అయితే, కొత్త సభ్యులు ఆరుగురూ ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ ప్రభుత్వ సర్వీసుల నుంచి రిలీవ్ కాకపోవడంతో మంగారి రాజేందర్, ప్రొఫెసర్ సాయిలు బాధ్యతలు స్వీకరించలేదు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications