ఉచిత బస్సు ప్రయాణం లో కొత్తగా, ఇక నుంచి - తాజా నిర్ణయం..!!
ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రయాణం కోసం మహిళల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో సైతం అనూహ్యంగా పెరగటం తో ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ కి ఆదాయం సైతం క్రమేణా పెరుగుతోంది. దీంతో... ఈ పథకం కోసం ఆర్టీసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో... మహిళల కష్టాలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం అమల్లోకి వస్తోంది.
తెలంగాణ లో మహాలక్ష్మీ పథకానికి డిమాండ్ పెరుగుతోంది. కొంత కాలం క్రితం వరకు 67 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 95 శాతానికి పెరిగింది. ముఖ్యంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లలో ఇది 110 శాతం దాటుతోంది. దీంతో గ్రామాలు, పట్టణాల నుంచి బస్సుల కోసం విజ్ఞాపనలు వస్తున్నాయి. బస్సులు తొలి గ్రామాల్లోనే నిండిపోవడంతో మధ్య గ్రామాల్లోని వారికి చోటు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ రూ.193.44 కోట్లతో 503 కొత్త బస్సుల కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు ఆర్డర్ ఇచ్చింది. వీటిల్లో ఎక్కువగా ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. హైదరాబాద్ నగరం పరిధిలో 115 బస్సులు.. ఇతర ప్రాంతాల్లో 388 బస్సులు వినియోగించేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రత్యేకంగా ఉచిత బస్సులకు పెరుగుతున్న డిమాండ్ మేరకు వీటిని ఎక్కువగా అందుకే వినియోగించాలని నిర్ణయించింది.

కాగా, ఉచిత బస్సు పథకం కోసం మహిళలకు ఇక నుంచి టికెట్లు.. ఆధార్ అవసరం లేకుండానే స్మార్ట్ కార్డులు జారీకి ఆర్టీసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే కసరత్తు మొదలైంది. అదే విధంగా రెగ్యులర్ పాస్ లు ఉన్న వారికి ఇదే తరహాలో కార్డులు ఇవ్వనున్నారు. ఇక నుంచి మహిళలకు సీట్ల విషయంలోనూ ఇబ్బంది లేకుండా తాజా మార్గదర్శకాలను ఆర్టీసీ సిద్దం చేస్తోంది. ఇక.. ఎలక్ట్రికల్ బస్సులను క్రమేణా పెంచుతున్న ఆర్టీసీ.. వీటిల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్ల అభివృద్ధికి సైతం నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతి నెలా టీజీఎస్ఆర్‌టీసీకి రూ.300 నుంచి రూ.350 కోట్లు కేటాయిస్తోంది. ఇప్పుడు ఆర్టీసీ తాజా నిర్ణయాలతో మహిళా ప్రయాణీకులకు ప్రయోజనం కలగనుంది.












Click it and Unblock the Notifications