వామ్మో ? బస్సును కూడా వదల్లేరు : నైట్‌హాల్ట్ కోసం స్టాఫ్‌లో పెడితే చోరీ
హైదరాబాద్ : కాదేది దొంగతనానికి అనర్హం అంటున్నారు దొంగలు. సైకిల్ .. బైకు ... అది కాదంటే కార్ల చోరీకి గురయ్యానే విన్నాం. కానీ బస్సు దొంగతనానికి గురవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదీ కూడా టీఎస్ఆర్టీసీ బస్సు. నైట్ హాల్ట్ కోసం ఉంచేసరికి .. దొంగలు గుట్టుచప్పుుడు కాకుండా బస్సునే తరలించి తాము కేటుగాళ్లమని నిరూపించుకున్నారు.

బస్సు ఏమయ్యింది ?
మంగళవారం రాత్రి 11 గంటలకు నైట్ హాల్ట్ కోసం గౌలిగుడ బస్ స్టాప్ లో ఆర్టీసీ బస్సును ఉంచారు. అటు ఇటు చూసిన దొంగలు .. ఎలాగూ బస్సుకు సంబంధించి డ్రైవర్, కండక్టర్ ఏలాగు లేరనుకొని నిర్ధారించుకొని .. తమ పని కానిచ్చేశారు. తెల్లవారి వచ్చి చూసి షాకవడం డ్రైవర్, కండక్టర్ వంతైంది. అదేంటి బస్సు లేదు కదా అని ఆశ్చర్యపోయారు.
ఇలా వెళుతోంది ?
రాత్రి 1 గంటకు తూప్రాన్ వద్ద నుంచి బస్సు వెళ్లినట్టు సీసీఫుటేజీలో కనిపించింది. అయితే బస్సు మిస్సై .. ఒకరోజు గడుస్తోన్నా దాని గురించి తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయినా గతంలో ఎన్నడూ లేనివిధంగా బస్సు చోరికి గురవడం సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications