TSRTC: విద్యార్థులకు శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ.. వారికి ఉచిత ప్రయాణం..!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 3 నుంచి 10 తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. దూరంతో సంబంధం లేకుండా, విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే, ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందేందుకు, విద్యార్థులు తమ పరీక్ష హాల్ టికెట్, బస్ పాస్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,652 కేంద్రాల్లో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు మొత్తం 4,94,458 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్‌ఎస్‌సీ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, గందరగోళం లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు అధికారులతో కూడిన ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. హాల్ టిక్కెట్లు సంబంధిత పాఠశాలలకు ఇప్పటికే పంపించారు. ఆన్ లైన్ కూడా విద్యార్థులు హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ హాల్ టికెట్ పై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకున్న పరీక్షలు రాయొచ్చని అధికారులు తెలిపారు.
హాల్ టికెట్ తీసుకున్న వారు రెండు, మూడు రోజుల ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పరీక్ష రాసే విద్యార్థిలు గంట ముందే పరీక్ష కేంద్రలకు వస్తే ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. కంట్రోల్ రూమ్ నెంబర్ 9030282993 కు ఫోన్ చేయాలని సూచించారు. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథ్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్ స్టడీస్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సారి పదో తరగతి పరీక్షల్లో భాగంగా మల్టీపుల్ చాయిస్ ప్రశ్నాపత్రం రాసేందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వనున్నారు. గతంలో బిట్ పేపర్‌కు 30 నిమిషాల సమయం ఇచ్చేవారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications