TSRTC STRIKE:కేసీఆర్‌ది ఒంటెద్దు పోకడ, కార్మికులతో చర్చలు జరపాలి: కోదండరాం
ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి సరికాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. వారి డిమాండ్లను పరిశీలించి, పరిష్కరిస్తామనే హామీనివ్వాలని సూచించారు. కానీ ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదన్నారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుందని కోదండరాం చెప్పారు. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వారి సమస్యలపై సానుకూలంగా వ్యహరించాలని హైకోర్టు సూచించినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో వేలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్ నియంతృత్వ వైఖరిని నిరసిస్తూనే కార్మికులు పోరాడుతున్నారని చెప్పారు. తమ హక్కుల కోసమే కార్మికులు పాటుపడుతున్నారని కోదండరాం చెప్పారు. వారి బాధను కేసీఆర్ అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. తమ డిమాండ్ల కోసం కార్మికులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే కార్మికులు 46 రోజులుగా సమ్మె చేయడం అరుదు అని చెప్పారు.
రాష్ట్రంలో కేసీఆర్‌ను ప్రశ్నించే పరిస్థితులు కూడా లేని సమయంలో కార్మికులు సమ్మె చేసి తమ సత్తా ఏంటో చాటారని తెలిపారు. తమ డిమాండ్లు ఏంటో ప్రజలకు తెలియజేయడంలో కార్మికులు విజయం సాధించారని.. వారిని అర్థం చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరుపాలని కోరారు. పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications