tsrtc strike: కేసీఆర్ అల్టిమేటం: ఆ ‘భయం’తోనే విధుల్లో చేరుతున్న కార్మికులు
హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5లోగా విధుల్లో చేరాలని, లేదంటే వారితో ఆర్టీసీ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆదివారం పలువురు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. అయితే, తమ ఉద్యోగాలు పోయి, కుటుంబాలు రోడ్డున పడతాయనే భయంతోనే విధుల్లో చేరుతున్నామని వారు చెప్పడం గమనార్హం.

ప్రజలూ ఇబ్బంది పడ్డారు.. ఎన్నికల ముందైతే..
ఆదివారం ఉదయం కామారెడ్డి డిపోకు చెందిన సయ్యద్ హైమద్ డిపోకు వెళ్లి తాను విధుల్లో చేరతానని చెప్పిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే కామారెడ్డి డిపోలో డ్రైవర్ పనిచేస్తున్న హైమద్ తిరిగి విధుల్లో చేరుతున్నట్లు డిపో మేనేజర్‌కు ఆదివారం మధ్యాహ్నం రిపోర్టు చేశారు. రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు హైమద్ వాపోయారు. ఎన్నికల ముందు సమ్మె చేస్తే లాభం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పండగల ముందు సమ్మె చేయడంతో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని అన్నారు.

ఆ భయంతోనే విధుల్లోకి..
అయితే, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తనలో భయం ఏర్పడిందని హైమద్ చెప్పారు. అందుకే తన సమ్మెను విరమించి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.విధుల్లో చేరేందుకు తనపై ఎవరి ఒత్తిడి లేదని అన్నారు. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొందరు యూనియన్ నేతలు వారించినప్పటికీ తాను విధుల్లో చేరానని చెప్పారు. కాగా, హైమద్ నిర్ణయంతో పల్లెబాట కార్యక్రమాన్ని డిపో కార్మికులు రద్దు చేసుకున్నారు. అతని కుటుంబసభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

ఒక్కొక్కరుగా విధుల్లో చేరుతున్న కార్మికులు
ఉప్పల్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ కృష్ణ.. తిరిగి విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం డిపో మేనేజర్‌కు లేఖ అందజేశారు. సిద్ధిపేట డిపోలు పనిచేస్తున్న కండక్టర్ బాల విశ్వేశ్వరరావు, సిరిసిల్ల డిపో మెకానిక్ కే శ్రీనివాస్, హయత్‌నగర్2 డిపో డ్రైవర్ గౌస్, మిర్యాలగూడ డిపోకు చెందిన కండక్టర్ ఎస్కే వలి విధుల్లో చేరేందుకు డిపోలకు వచ్చారు. భద్రాచలం డిపోకు చెందిన శేషాద్రి అనే కార్మికుడు కూడా విధుల్లో చేరడానికి వస్తే.. యూనియన్ నాయకులు కొందరు అడ్డుకున్నారు. అతని కళ్లల్లో కారంపొండి పోసి వెనక్కిపంపించినట్లు తెలిసింది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications