వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TSRTC STRIKE:కేసీఆర్ డెడ్‌లైన్‌తో కార్మికుల్లో కదలిక, విధుల్లో చేరుతున్న ఉద్యోగులు..

|
Google Oneindia TeluguNews

విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించడంతో కొందరు కార్మికులు కొలువులో జాయిన్ అవుతున్నారు. ఒక్కొక్కరు డిపోలకు కదిలివస్తున్నారు. డ్యూటీలో చేరిన ఉద్యోగులకు రక్షణ కల్పిస్తామని పోలీసులు చెప్తున్నారు. బెదిరించిన వారి గురించి ఫిర్యాదు చేయాలని జగిత్యాల ఎస్పీ కార్మికులను కోరారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

డెడ్‌లైన్

డెడ్‌లైన్

మంగళవారం అర్ధరాత్రిలోపు భేషరతుగా విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించడంతో.. ఆర్టీసీ కార్మికులు కదులుతున్నారు. ఒక్కొక్కరు విధుల్లో చేరుతున్నారు. ఇప్పటికే సమ్మె 30వ రోజుకు చేరుకోవడం.. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం సుముఖంగా లేదని అర్థమైంది. అంతేకాదు జీతాలు కూడా లేకుండా కొందరు కార్మికులు అల్లాడుతున్నారు. దీంతో విధుల్లో చేరడమే మార్గమని భావిస్తున్నారు.

 డిపోలకు కార్మికులు

డిపోలకు కార్మికులు

సిరిసిల్ల, సిద్ధిపేట, భద్రాచలంలో డిపోలకు ఒక్కొ కార్మికులు చేరుకుంటున్నారు. భేషరతుగా విధుల్లో చేరుతున్నామని ప్రకటించారు. సిరిసిల్ల డిపోలో మెకానిక్ శ్రీనివాస్ డ్యూటీలో చేరారు. సిద్దిపేటలో కండక్టర్ విశ్వేశ్వరరావు కూడా విధుల్లో చేరారు. కామారెడ్డిలో డిపో డ్రైవర్ సయ్యద్ హైమద్.. భద్రాచలంలో డ్రైవర్ శేషాద్రి డ్యూటీలో చేరారు. విధుల్లో చేరిన వారికి రక్షణ కల్పిస్తామని పోలీసులు చెప్తున్నారు.

బెదిరింపులు, ఖండనలు

బెదిరింపులు, ఖండనలు

5వ తేదీ అర్ధరాత్రిలోపు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ అల్టిమేటం జారీచేశారు. విధుల్లో చేరకుంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని సంకేతాలు ఇచ్చారు. దీనిని ఆర్టీసీ జేఏసీ ఖండించింది. ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగించే అధికారం సీఎం కేసీఆర్‌కు లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరించడం సరికాదన్నారు. తమకు డెడ్‌లైన్ విధించకుండా మంత్రిమండలి కమటీ వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

అలా ఎలా ..?

అలా ఎలా ..?

కొత్తగా 5100 ప్రైవేట్ బస్సులకు అనుమతి ఎలా ఇస్తారని అశ్వత్ధామ ప్రశ్నించారు. ఆ బస్సులు నడిపేందుకు 27 వేల మంది కార్మికులు అవసరమవుతారు. మరి 2100 మంది బస్సుల సంగతేంటీ ? ఆయా కార్మికుల పరిస్థితి ఏంటి అని అడిగారు. అసెంబ్లీలో చేసిన చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని అశ్వత్థామ ప్రశ్నించారు.

English summary
cm kcr deadline to rtc workers.. some employees join duties. sircilla, siddipeta, bhadrachalam dist some employees join duties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X