TSRTC STRIKE:కార్మికుల డిమాండ్లు పరిష్కరించం, చర్చలు జరపం, హైకోర్టులో ఆర్టీసీ అఫిడవిట్
ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో కార్మికులు సమ్మెకు దిగారని ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు 11 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు కార్పొరేషన్ 44 శాతం అంటే రూ.473 కోట్ల వరకు నష్టం చవిచూసిందని పేర్కొన్నారు. విలీనమనే అసహేతుక డిమాండ్‌ను కార్మికులు తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో కార్పొరేషన్ తరఫున తుది అఫిడవిట్ దాఖలు చేశారు.

డిమాండ్లు పరిష్కరించలేం..
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. విలీనం పేరుతో సంస్థ, ప్రభుత్వాన్ని కార్మికులు ఇబ్బందికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించలేమని స్పష్టంచేశారు. అంతేకాదు కార్మికులతో ఇక చర్చలు కూడా జరపలేమని అఫిడవిట్‌లో తేల్చిచెప్పారు.

తాత్కాలికమని చెప్పినా..
ఇటీవల కార్మిక నేతలు విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెడతామని చెప్పారు. దానిని తాము విశ్వసించబోమని అఫిడవిట్‌లో సునీల్ శర్మ పేర్కొన్నారు. ఒకవేళ వారు డిమాండ్ పక్కన పెట్టినా మళ్లీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని చెప్పారు. టెంపరరీగా వాయిదావేసి... అదనుచూసి దెబ్బ కొట్టే అవకాశం ఉందన్నారు. అందుకోసమే వారు విలీనం అంశాన్ని పక్కనపెట్టిన చర్చలు జరపబోమని తేల్చిచెప్పారు.

పండగ సమయంలో
కార్మికులు సమయం చూసి సమ్మెకు వెళ్లారని సునీల్ శర్మ గుర్తుచేశారు. బతుకమ్మ, దసరా సమయంలో స్ట్రైక్ వెళ్లడం పెద్ద తప్పు అన్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న కార్పొరేషన్.. మరింత కుంగిపోయిందని చెప్పారు. కార్మికుల సమ్మెతో ఇప్పటికే 44 శాతం నష్టం వచ్చిందని గుర్తుచేశారు. కార్మికుల ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చలేమని తెలిపారు.

నేతల స్వార్థంతోనే
ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మె వెనక నేతలు, ప్రతిపక్షాలు ఉన్నాయని పరోక్షంగా సునీల్ శర్మ పేర్కొన్నారు. వారి వ్యక్తిగత స్వార్థం కోసం, కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. కార్మికుల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే 23 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications