వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు: కండక్టర్ సస్పెన్షన్

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్‌ ఆర్టీసీ డిపో 1 కండక్టర్ సంజీవ్‌ను సస్పెండ్‌ చేశారు.

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్‌ ఆర్టీసీ డిపో 1 కండక్టర్ సంజీవ్‌ను సస్పెండ్‌ చేశారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులపై కండక్టర్ వివరణ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులపై కండక్టర్ వివరణ

ఈ మేరకు ఆర్టీసీ డిపో 1 డిపో మేనేజర్ ఆనంద్‌ తెలిపారు. సంజీవ్ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

TSRTC suspends conductor for FB post

పేస్‌బుక్‌ పోస్టింగ్‌లపై విచారణ జరిపి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ హెచ్చరించిన కొద్ది రోజులకే సస్పెండ్ చేయడం గమనార్హం.

సస్పెన్షన్‌పై సంజీవ్ మాట్లాడారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టలేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశానని చెప్పారు. తనకు ఇతర ఉద్దేశాలేమి లేవన్నారు.

తనను అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు. తాను ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నించానని, కార్మికులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉందన్నారు. కాగా, ఇది అన్యామంటూ సీఐటీయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు డిపో 1 ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు.

English summary
Sanjeev, conductor of the Telangana State Road Transport Corporation (TSRTC), was suspended from service for posting comments on social media against the state government and the Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X