నిరుద్యోగులకు టీఎస్ఆర్టీసీ మంచి అవకాశం: వివిధ కోర్సుల్లో ట్రైనింగ్, ఆప్లై చేయండి
హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) శుభవార్త చెప్పింది. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలని అనుకునే నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనుంది. వరంగల్ జిల్లాలోని టీఎస్ఆర్టీసీ ఐటీసీ కాలేజీలో వివిధ శాఖలకు సంబంధించిన కోర్సుల్లో ప్రవేశాలకు ఆప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
వరంగల్‌లోని TSRTC ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు జులై ౩1 తుది గడువు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివి.

నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలను సంస్థ ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు వరంగల్ ములుగు రోడ్డులోని టీఎస్‌ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించగలరు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు, అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత టీఎస్ఆర్టీసీ అధికారులు సూచించారు. రెండేళ్లపాటు కోర్సు కొనసాగుతుంది. పదవ, ఎనిమిదవ తరగతి చదివినవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.సొంతంగా ఎదగాలని, జీవితం స్థిరపడాలని కలలు కనే వారికి, స్వయం ఉపాధి రంగంలో స్థిరపడెందుకు ఈ ఐటీఐ కోర్సులు మంచి అవకాశమని చెప్పొచ్చు. వరంగల్ ఐటీఐ కాలేజ్‌లో నిరుద్యోగ యువతకు మంచి శిక్షణ ఇచ్చి లైఫ్‌లో సెట్ అయ్యే విధంగా ఈ ట్రైనింగ్ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications