టీఎస్ ఎస్పీడీసీఎల్‌లో 1601 ఉద్యోగాలకు నోటిఫికేషన్
టీఎస్ ఎస్పీడీసీఎల్‌లో 1601 ఉద్యోగాల భర్తీకి సంక్షిప్త ప్రకటన వెలువడింది. డైరెక్ట్ ప్రాతిపదికన 1553 జూనియర్ లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ గురువారం ప్రకటనను విడుదల చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎస్పీడీసీఎల్)లో 1601 ఉద్యోగాల భర్తీకి సంక్షిప్త ప్రకటన వెలువడింది. డైరెక్ట్ ప్రాతిపదికన 1553 జూనియర్ లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ గురువారం ప్రకటనను విడుదల చేసింది.
అయితే, ఈ ఉద్యోగాలకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 15 లేదా ఆ తర్వాత తమ అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. రాత పరీక్ష, నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
గత నోటిఫికేషన్ ఆధారంగా అర్హతలను పరిశీలించినట్లయితే..
జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు పదో తరగతితోపాటు ఐటీఐ(ఎలక్ట్రిక్ ట్రేడ్/వైర్‌మ్యాన్) లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఎలక్ట్రిక్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
జూనియర్ లైన్‌మెన్ ఖాళీలకు రాత పరీక్షతోపాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
వయో పరిమితి:
18 నుంచి 35 ఏళ్లు.

జీతం:
రూ. 24,340-39,405
అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగాలకైతే ఇంజినీరింగ్‌లో డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉండాలి.
వయో పరిమతి:
18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: 64,295-99,345
కాగా, గత ఏడాది మే నెలలోనే 1000 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినప్పటికీ.. కొందరు ఈ పరీక్షలో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నియామక ప్రక్రియను రద్దు చేశారు. అయితే, త్వరగా మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాలు చేయడంతో తాజాగా ఈ నోటిఫికేషన్ వెలువడింది.












Click it and Unblock the Notifications