అప్పుడే!: కాంగ్రెస్ ఫ్లెక్సీల్లోకి ఎక్కిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో టీటీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి చేరతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కలకలం మొదలైంది. కొందరు సీనియర్ నేతలు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వవద్దని అంటుండగా ర
వరంగల్: కాంగ్రెస్ పార్టీలో టీటీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి చేరతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కలకలం మొదలైంది. కొందరు సీనియర్ నేతలు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వవద్దని అంటుండగా రేవంత్ రావడం వల్ల పార్టీకి, రేవంత్‌కి కూడా మంచిదేనని మరికొందరు నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫొటోను స్థానిక నాయకులు కొందరు కాంగ్రెస్ ఫ్లెక్సీలో పెట్టేశారు. రేవంత్‌రెడ్డి చిత్రంతో పాటు కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి, స్థానిక నేతలతో కూడిన ఈ ఫ్లెక్సీని కృష్ణారెడ్డి, సాంబరాజులు ఏర్పాటు చేశారు.

డీకే అరుణతో రేవంత్ భేటీ
హైదరాబాద్: టీడీపీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే డీకే అరుణతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరుతున్నారని, ఈ పరిణామాన్ని డీకే అరుణ వ్యతిరేకిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశమైంది.
గురువారం హైదరాబాద్‌లోని డీకే అరుణ నివాసానికి వచ్చిన రేవంత్‌రెడ్డి అరుణతోపాటు ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే డి.కె.భరతసింహారెడ్డిలతో సమావేశమై వివిధ రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇటీవల దిల్లీలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో రేవంత్‌రెడ్డి సమావేశం, కాంగ్రెస్‌లో చేరే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
రేవంత్‌రెడ్డితోపాటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కశ్యప్‌రెడ్డి కూడా డీకే అరుణ నివాసానికి వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం కూడా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నేతతో భేటీ అయినట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కావడానికి ముందే తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రులను రేవంత్ కలసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications