ట్విస్ట్: నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu
  Revanth Reddy Issue : నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్ | Oneindia Telugu

  హైదరాబాద్: టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహరంలో తెలంగాణ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అక్టోబర్ 28వ, తేదిన పార్టీ నేతలతో అమరావతిలో చంద్రబాబునాయుడు సమావేశంకానున్నారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. మరోవైపు రేవంత్‌పై ఫిర్యాదు చేసేందుకు మోత్కుపల్లి నర్సింహ్ములు, అరవింద్‌కుమార్‌గౌడ్‌ చేసిన ప్రయత్నాలను చంద్రబాబు నిలువరించారు.

  'రేవంత్‌‌పై బాబుదే తుది నిర్ణయం, తప్పు చేశానని నిరూపిస్తే తప్పుకొంటా'

  టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో పార్టీ పదవుల నుండి రేవంత్‌రెడ్డిని తొలగించారు.రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు హైద్రాబాద్‌ లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు.

  వాళ్ళంతా కెసిఆర్ మనుషులే: టిడిపి నేతలపై రేవంత్‌ సంచలనం

  రేవంత్‌ వ్యవహరంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. అదే సమయంలో చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్‌పై ఫిర్యాదు చేసేందుకు నేతలు ప్రయత్నిస్తే బాబు నిలువరించారు.

  ట్విస్ట్:టిడిఎల్పీ నుండి కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్

  రేవంత్‌ వ్యవహరం ఇంకా పెండింగ్‌లోనే

  రేవంత్‌ వ్యవహరం ఇంకా పెండింగ్‌లోనే

  టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహరాన్ని చంద్రబాబునాయుడు తేల్చలేదు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలను బాబుకు వివరించారు. అక్టోబర్‌ 8వ, తేద తర్వాత రేవంత్‌రెడ్డి ఏం చేశారనే విషయాలపై బాబుకు రమణ వివరించారు. ఇవాళ ఉదయమే బాబు నివాసానికి చేరుకొని రేవంత్‌ విషయాన్ని వివరించారు. అటు తర్వాత లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో కూడ ఈ విషయమై రమణ బాబుకు పత్రికల్లో వచ్చిన కథనాలను అందించారు.బాబుతో రేవంత్‌రెడ్డి ఏకాంతంగా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదావేశారు. రేపు అమరావతిలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

  రేవంత్‌పై ఫిర్యాదుకు యత్నం, నిలువరించిన బాబు

  రేవంత్‌పై ఫిర్యాదుకు యత్నం, నిలువరించిన బాబు

  రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహ్ములు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్‌కుమార్‌గౌడ్ ప్రయత్నించారు. అయితే సమావేశంలోనే చంద్రబాబునాయుడు వారిని నిలువరించారు.అన్ని విషయాలు తనకు తెలుసునని బాబు చెప్పారు. దీంతో రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేయకుండా నేతలంతా మిన్నకుండిపోయారు.

  సమావేశంలో నోరు విప్పని రేవంత్

  సమావేశంలో నోరు విప్పని రేవంత్

  చంద్రబాబునాయుడుతో పార్టీ నేతల సమావేశంలో రేవంత్‌రెడ్డి నోరు విప్పలేదని సమాచారం. అంతేకాదు తనపై పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన నివేదిక సమయంలో కూడ రేవంత్ ఆ విషయాలపై వివరణ ఇచ్చుకోలేదని సమాచారం. అయితే రేవంత్‌రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. పార్టీ నేతలు తనపై చేసిన ఆరోపణలతో పాటు, ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలపై రేవంత్ వివరణ ఇచ్చారని సమాచారం.

  ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం

  ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం

  ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం ఉంటుందని చంద్రబాబునాయుడు సమావేశంలో మరోసారి ప్రకటించారని సమాచారం. పొత్తులపై ఎవరు కూడ నోరు మెదపకూడదని బాబు పార్టీ నేతలకు సూచించారని తెలుస్తోంది.

  రేవంత్ అమరావతి సమావేశానికి వెళ్ళేనా?

  రేవంత్ అమరావతి సమావేశానికి వెళ్ళేనా?

  రేపు అమరావతిలో జరిగే సమావేశానికి రేవంత్‌రెడ్డి హజరౌతారా లేదా అనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ నేతల తీరుతో రేవంత్‌రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారని రేవంత్‌రెడ్డి సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. తన వివరణను బాబుకు వివరించిన తర్వాతే రేవంత్‌రెడ్డి శుక్రవారం నాడు లేక్‌వ్యూలో జరిగిన సమావేశానికి హజరయ్యారని అంటున్నారు. అయితే అదే సమయంలో అమరావతిలో జరిగే సమావేశానికి రేవంత్ హజరౌతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

  రేవంత్‌ను ఏకాకిని చేసే ప్రయత్నం

  రేవంత్‌ను ఏకాకిని చేసే ప్రయత్నం


  రేవంత్‌రెడ్డిని ఏకాకిని చేసే ప్రయత్నం జరిగిందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు కొందరు నేతలు సమావేశంలో రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం.అయితే కొందరు నేతలు రేవంత్ విషయమై ఏకాంతంగా మాట్లాడాలని కోరారు. దీంతో అమరావతిలో సమావేశంలో ఏకాంతంగా మాట్లాడే అవకాశం దక్కనుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TTDP leaders will meet with TDP chief Chandrababunaidu on Oct 28 at Amaravathi. Chandrababunaidu meeting with TTDP leaders on Fridaya at Lakeview guest house. But not yet take a decission on Revanth Reddy issue.Meeting will postponed to tomorrow

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి