కారు తుక్కు: తుల ఉమ ఎస్కేప్ (ఫొటోలు)
మెదక్: కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం టీఆర్‌ఎస్ నేత హరిచరణ్, గన్‌మెన్ రమేశ్, అటెండర్ రమేశ్, డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్‌తో కలిసి ఆమె ఇన్నోవా కారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
రాజీవ్హ్రదారిపై మెదక్ జిల్లా దుద్దెడ టోల్‌గేట్ దాటగానే, చౌరస్తా వద్ద వీరి వాహనాన్ని హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపుకు వస్తున్న స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న సిద్దిపేట జెడ్పీటీసీ సభ్యురాలు గ్యార వజ్రవ్వ, ఆమె భర్త యాదగిరి, బక్రిచెప్యాల వార్డు సభ్యుడు రఘురాములు తీవ్రంగా గాయపడ్డారు.
వెనుకాలే వచ్చిన ఇండికా సైతం స్విఫ్ట్‌ను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. తుల ఉమ, గన్‌మెన్ రమేశ్, అటెండర్ రమేశ్, హరిచరణ్‌లు స్వల్పగాయాలతో బయటపడగా సిద్దిపేటలో చికిత్స అందించారు.

తప్పిన ప్రమాదం
కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ కారు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు తుక్కు తుక్కు అయింది.

తప్పిన ప్రమాదం
కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తుల ఉమ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు ఢీకొట్టింది.

తప్పిన ప్రమాదం
కరీంనగర్ జిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ ప్రయాణిస్తున్న కారు మంగళవారంనాడు ప్రమాదానికి గురైంది.

తప్పిన ప్రమాదం
తుల ఉమ ప్రయాణిస్తున్న కారు రాజీవ్ రహదారిపై ప్రమాదానికి గురైన సంఘటనలో సిద్ధిపేట జడ్పీటిసి గ్యార వజ్రవ్వ, ఆమె భర్త యాదగిరి తదితరులు గాయపడ్డారు.

తప్పిన ప్రమాదం
ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు తుల ఉమ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టింది. దానికితోడు వెనక వస్తున్న మరో కారు స్విఫ్ట్ కారును ఢీకొట్టింది.












Click it and Unblock the Notifications