హైదరాబాద్‌లో కుంగిన రోడ్డు: రద్దీగా ఉండే రహదారిలో 20 అడుగుల గుంత!

హైదరాబాద్ నగరంలో కీలకమైన ఎంజీబీఎస్-చాదర్‌ఘాట్ రహదారి శుక్రవారం ఒక్కసారిగా కుంగిపోయింది. పెద్ద గుంతపడింది. ఈ గుంత దాదాపు 20 అడుగుల లోతు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

హైదరాబాద్: నగరంలోని మరో ప్రాంతంలో రద్దీ రహదారిపై ఓ భారీ గుంత కలకం రేపింది. అయితే, ట్రాఫిక్ పోలీసులు, జలమండలి అధికారులు సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఇటీవల ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడోది కావడం గమనార్హం.

కీలకమైన ఎంజీబీఎస్-చాదర్‌ఘాట్ రహదారి శుక్రవారం ఒక్కసారిగా కుంగిపోయింది. పెద్ద గుంతపడింది. ఈ గుంత దాదాపు 20 అడుగుల లోతు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గుంతపడిన ప్రాంతంలో మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తూ ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు.

Twenty feet deep hole at chaderghat road in hyderabad

అయితే, నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఇప్పటికిప్పుడు గుంతను తవ్వి మరమ్మతులు చేయడం సాధ్యం కాదని.. అలా చేస్తే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. రాత్రి సమయంలో ఎంజీబీఎస్-చాదర్‌ఘాట్ మార్గంలో రాకపోకలు నిలిపివేసి మరమ్మతులు చేస్తామని అధికారులు వెల్లడించారు.

కాగా, రోడ్డు మధ్యలో అసలు గుంత ఎందుకు పడిందో తెలియదని వాటర్ బోర్డ్, జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. సివరేజ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయ్యి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ గుంత పెద్దగా అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+