ప్రత్యూష జీవితంలో ఊహించని ట్విస్ట్..! దత్త పుత్రికపై కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుందో..

సవతి తల్లి చేతిలో చిత్రహింసల పాలై.. చివరకు ఓ స్వచ్చంద సంస్థ సహాయంతో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రత్యూషను తెలంగాణ ప్రభుత్వం చేరదీసిన విషయం తెలిసిందే. ఒళ్లంతా గాయాలతో, మొహం మీద సవతి తల్లి పెట్టిన వాతలతో ఉన్న ప్రత్యూషను చూసి ప్రతీ ఒక్కరు చలించిపోయారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యూష ఆలనా పాలనా తానే చూసుకుంటానని ముందుకురావడం హర్షనీయం.

ప్రత్యూషను దత్త పుత్రికగా స్వీకరించిన కేసీఆర్ ఆమె చదువు, పెళ్లికి సంబంధించిన బాధ్యతలను తానే చూసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రత్యూష మనసు ఇప్పుడు పెళ్లి మీదకు మళ్లినట్టుగా సమాచారం. ఆమె తన ప్రియుడితో పెళ్లి కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ హాస్టల్ లో ఆశ్రయం పొందుతున్న ప్రత్యూష ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో విద్యను అభ్యసిస్తోంది.

twist in pratyushas life

అయితే.. ఏమైందో ఏమో తెలియదు గానీ ఉన్నట్టుండి ప్రత్యూష మనసు పెళ్లి మీదకు మళ్లింది. ఇదే విషయాన్ని ప్రత్యూష మహిళా శిశు సంక్షేమ అధికారులతో తెలియజేయడంతో, ప్రత్యూష కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టుతో పాటు సీఎంఓ కు తెలియజేశారు అధికారులు. విషయం తెలుసుకున్న కేసీఆర్, ప్రత్యూష ప్రేమిస్తున్న అబ్బాయి వివరాలను తెలుసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ప్రత్యూష కేసును విచారిస్తున్న హైకోర్టు, తమ నిర్ణయాన్ని వెలువరించేవరకు.. ప్రత్యూషను, తను ప్రేమిస్తున్న అబ్బాయితో కలవకుండా చూడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా.. ప్రత్యూష ప్రేమిస్తున్న అబ్బాయి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ ఆటో మొబైల్ షాపులో పనిచేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ప్రత్యూషను ఆ అబ్బాయి తరచూ కలవడానికి వచ్చి వెళ్తుంటాడని అధికారులు చెప్తున్నారు. మరి ప్రత్యూష ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు. ఏదేమైనా కేసీఆర్ లాంటి వ్యక్తి అండగా ఉండగా ప్రత్యూషకు అంతా మంచే జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+