స్టార్ హోటల్లో సెక్స్ రాకెట్, అలా దొరికారు: ఇద్దరు డ్యాన్సర్లు, విద్యార్థి అరెస్ట్
Recommended Video

హైదరాబాద్: స్టార్ హోటళ్లలో వ్యభిచారం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేసిన ఓ యువకుడితో పాటు ఇద్దరు డ్యాన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్లో దిగే సమయంలో రికార్డులు చూపించే సమయంలో పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో జరిగింది. మూడు రోజుల క్రితం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇబ్రహీం అనే విద్యార్థితో పాటు ఇద్దరు యువతులు హోటల్‌కు వచ్చారు. ఇబ్రహీం పేరు మీద గది బుక్ అయింది. అతను హోటల్ రిసెప్షన్ వద్దకు వెళ్లాడు. అప్పుడు పక్కనే ఇద్దరు యువతులు ఉన్నారు. సిబ్బంది అతనిని ఐడెంటిడీ రికార్డులు అడిగారు.

పొంతనలేని సమాధానం చెప్పడంతో దొరికారు
ఈ సమయంలో వారు ముగ్గురు పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన రిసెప్షన్ వారి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇబ్రహీంతో పాటు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను పలు విషయాలు చెప్పాడు. తాను ఎంబీయే చదివానని, తనకు పరిచయం ఉన్న సల్మాన్ అనే వ్యక్తి వ్యభిచార నేపథ్యంలో ఈ ఇద్దరు యువతులను తనకు అప్పగించారని చెప్పాడు. ఇందుకు తాను పదకొండు వేల రూపాయలు ఇచ్చానని తెలిపాడు.

ఇద్దరు యువతులు డ్యాన్సర్లు
పోలీసులు ఇద్దరు యువతులను డ్యాన్సర్లుగా గుర్తించారు. ఇద్దరు యువతుల్లో ఒకరు హైదరాబాదుకు చెందిన వారు కాగా, మరొకరు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు. పోలీసులు ఇబ్రహీంపై కేసు నమోదు చేశారు. అతను చెప్పిన సల్మాన్ పరారీలో ఉన్నాడు.

రెండో శ్రేణి తారలు
కాగా, ఇటీవల ఇలాంటి ఘటనలపై పోలీసులు దాడులు నిర్వహిస్తోన్నారు. ఈ ఊబిలో ద్వితీయ శ్రేణి హీరోయిన్లు కూడా ఉంటున్నారు. ఈ నెల ప్రారంభంలో ఓ స్టార్ హోటల్లో ద్వితీయ శ్రేణి హీరోయిన్‌ను, వ్యభిచార నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల చర్యలు
అంతకుముందు, డిసెంబర్ నెలలో ముంబైకి చెందిన ఇద్దరు రెండో శ్రేణి సినీతారలు పట్టుబడ్డారు. సంపన్నులు నివసించే ప్రాంతాల్లోని అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్ నివాసాలను కూడా అద్దెకు తీసుకొని వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications