విషాదం: ఈతకు వెళ్లి మామఅల్లుడు మృతి(పిక్చర్స్)
రంగారెడ్డి: జిల్లాలోని దుండిగల్‌లో ఘటన చోటు చేసుకుంది. ఈత కోసం చెరువులోకి దిగి గల్లంతైన మామ, అల్లుడు మృతి చెందారు. వారి మృతదేహాలను దుండిగల్ పోలీసులు బుధవారం మధ్యాహ్నం వెలికితీశారు. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. . సూరారం కాలనీ, పాండుబస్తీకి చెందిన అనసూయ కుమార్తె హేమలతకు అరవింద్ (09), శాలినిలు సంతానం. హేమలత మృతి చెందింది. తండ్రి లేడు.
చిన్ననాటి నుండి అనసూయ వద్దనే అరవింద్ ఉంటున్నాడు. స్థానికంగా రెండవ తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అరవింద్‌కు వరసకు మేనమామ శ్రీనివాస్ (40) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో మద్యం సేవించి వచ్చిన శ్రీనివాస్ అరవింద్‌ను తీసుకుని ఇంట్లో నుండి వెళ్లాడు. అప్పటికీ అరవింద్ సోదరి శాలిని వ్యతిరేకించింది.
అయినా వినకుండా అరవింద్‌ను తీసుకుని వెళ్లాడు. అర్థరాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుప్రక్కల వెతికారు. ఆచూకి దొరకలేదు. బుధవారం ఉదయం మెట్టుకానిగూడలోని పెద్దచెరువు వద్ద అరవింద్, శ్రీనివాస్‌ల బట్టలు కనిపించాయి. దీంతో చెరువులో మృతిచెంది ఉంటారని బంధువులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్లతో గాలించి శ్రీనివాస్, అరవింద్‌ల మృతదేహాలను వెలికితీశారు. అరవింద్ మృతదేహాన్ని చూసిన అమ్మమ్మ రోదనలు మిన్నంటాయి. చెరువులో స్నానానికి వచ్చి ఈత రాక చెరువులో మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు, స్థానికులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెలికితీసిన మామ మృతదేహం
రంగారెడ్డి జిల్లాలోని దుండిగల్‌లో ఘటన చోటు చేసుకుంది.

అల్లుడి మృతదేహం
ఈత కోసం చెరువులోకి దిగి గల్లంతైన మామ, అల్లుడు మృతి చెందారు. వారి మృతదేహాలను దుండిగల్ పోలీసులు బుధవారం మధ్యాహ్నం వెలికితీశారు.

శ్రీనివాస్ (ఫైల్)
దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. . సూరారం కాలనీ, పాండుబస్తీకి చెందిన అనసూయ కుమార్తె హేమలతకు అరవింద్ (09), శాలినిలు సంతానం. హేమలత మృతి చెందింది. తండ్రి లేడు.

అరవింద్(ఫైల్)
చిన్ననాటి నుండి అనసూయ వద్దనే అరవింద్ ఉంటున్నాడు. స్థానికంగా రెండవ తరగతి చదువుతున్నాడు.

చెరువు
అదే ప్రాంతానికి చెందిన అరవింద్‌కు వరసకు మేనమామ శ్రీనివాస్ (40) పెయింటింగ్ పనిచేస్తుంటాడు.












Click it and Unblock the Notifications