ఆరు నెలల పాటు ఇద్దరు బాలికలతో సెక్స్: ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్ల అరెస్టు

కరీంనగర్: ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్ బాలికలను లైంగిక వాడుకుని మోసం చేసిన కేసులో ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గన్నేరువరం గ్రామంలో చోటు చేసుకుంది.

గన్నేరువరం గ్రామానికి చెందిన పొన్నాల శ్రీకాంత్, ఇరుకుర్తి కిరణ్‌లను అరెస్టు చేసినట్లు కరీంనగర్ డిఎస్పీ జె. రామారావు చెప్పారు. బాలికలు కూడా అదే గ్రామంలో నివసిస్తున్నారు. వారిద్దరి వయస్సు కూడా 17 ఏళ్ల లోపే ఉంటుంది. ఉపాధి కోసం బాలికల తల్లిదండ్రులు జార్ఖండ్ వెళ్లారు. బాలికలు మాత్రమే అదే గ్రామంలో ఉంటున్నారు.

Two drivers held for impregnating minors

చదువుసంధ్యలు కూడా లేని ఆ ఇద్దరు బాలికలతో శ్రీకాంత్, కిరణ్ స్నేహం చేశారు. తాము ప్రేమిస్తున్నామని, పెళ్లి చేసుకుంటామని నమ్మించారు. అలా ఆరు నెలల పాటు బాలికలను వారిద్దరు లైంగికంగా వాడుకున్నారు. దాంతో వారిద్దరు గర్బం దాల్చారు.

ఆ విషయాన్ని బాలికలు ట్రాక్టర్ డ్రైవర్లకు చెప్పారు. పిల్లలు బలంగా పుడుతారంటూ నమ్మించి వారికి డ్రైవర్లు ఏవో మాత్రలు ఇచ్చారు. ఆ మాత్రలు మింగిన తర్వాత బాలికలకు గర్భస్రావాలు జరిగాయి. డ్రైవర్లు తమను మోసం చేసిన విషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు.

బాలికల తల్లిదండ్రులు కొద్దిరోజుల క్రితం గ్రామానికి తిరిగి వచ్చి కమ్యూనిటీ పెద్దలకు విషయం చెప్పారు. నష్టపరిహారం చెల్లించడానికి సమావేశంలో నిర్ణయం జరిగింది. అయితే, కొంత మంది గ్రామస్థులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+