డబ్బు కోసం వ్యభిచారంలోకి.. చివరకు అడ్డంగా బుక్కయ్యాడు..

హైదరాబాద్: చదివింది ఉన్నత చదువులు.. కానీ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా పదివేలకు మించి వేతనం ఆఫర్ చేయడం లేదు. ఇలా అయితే జీవితంలో ఎదగడం కష్టమనుకున్నాడు. అడ్డదారైనా సరే, త్వరగా లక్షలు సంపాదించేయాలనుకున్నాడు. ఇంకేముంది? మరో యువతితో కలిసి వ్యభిచారంలోకి దిగబోయాడు. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు దర్గామిట్ట ప్రాంతానికి చెందిన షేక్‌రహ్మాన్‌ (22) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. అయితే ఎక్కడికెళ్లినా వేతనం తక్కువగా ఆఫర్ చేస్తుండటంతో బాగా విసుగు చెందాడు. తక్కువ సమయంలో లక్షలు సంపాదించేందుకు ఓ స్కెచ్ వేశాడు. నగరంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న ఓ ఒంగోలు యువతితో మాట్లాడి వ్యభిచారానికి ఒప్పించాడు.

two held in hyderabad on charges of prostitution

నెలకు రూ.50వేలు వేతనం ఇస్తామని ఆమెకు నమ్మబలికాడు. యువతి కూడా అంగీకరించడంతో బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. విటులను ఆకర్షించేందుకు ఆన్‌లైన్‌లో ఆమె ఫోటోలు పోస్టులు చేశాడు. తీరా విషయం బంజారాహిల్స్ పోలీసులకు తెలియడంతో గురువారం రాత్రి ఆ ఫ్లాట్ పై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+