పురోగతి: ఎంసెట్ 2 లీకేజీ కేసులో మరో ఇద్దరు బ్రోకర్లు అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు బ్రోకర్లను సీఐడీ అధికారులో అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న నిజామాబాద్‌కు చెందిన రామకృష్ణ అనే వ్యక్తితో పాటు జార్ఖండ్ రాంచీకి చెందిన శ్యాం యాదవ్ అలియాస్ గుడ్డూ అనే వ్యక్తిని సోమవారం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.
నిజామాబాద్‌కు చెందిన రామకృష్ణ హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో నివాసముంటున్నాడు. విచారణలో భాగంగా రామకృష్ణ ఎన్‌ఐఎన్‌లో రీసెర్చి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇక ముంబైకి చెందిన గుడ్డూ ఎంసెట్ 2 స్కాం వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి పరారీలో ఉన్నాడు.

అయితే ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మయాంక్‌సింగ్‌కు అనుచరుడు. పరీక్షకు ముందు ముంబైలో 8 మంది విద్యార్ధులు ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటులో శ్యాం యాదవ్ కీలక పాత్ర పోషించాడని అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా నలుగురు విద్యార్ధుల నుంచి రూ. 60 లక్షలు వసూలు చేసి, ఆ మొత్తాన్ని మయాంక్ సింగ్‌కు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఇక రామకృష్ణ విషయానికి వస్తే నలుగురు విద్యార్ధులను షిరిడీలో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించాడు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications