ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ల గుట్టురట్టు: యువతుల అందాన్ని వర్ణిస్తూ..

హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొనసాగుతున్న ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్న రెండు ముఠాల గుట్టును పోలీసులు మంగళవారం బయటపెట్టారు. టెక్నాలజీని అందిపుచ్చుకున్న ఈ ముఠాలు.. అందమైన అమ్మాయిల ఫొటోలను ఆయా వెబ్ సైట్లలో పెట్టి, వారి శరీరాకృతుల గురించి వర్ణిస్తూ పూర్తి వివరాలను నిక్షిప్తం చేయడంతోపాటు కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చారు. భారీ స్థాయిలో సాగుతున్న ఈ ముఠా వ్యభిచార వ్యాపారాన్ని పోలీసులు రట్టు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.

రాచకొండ ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన ప్రాచీశర్మ తన స్నేహితుడు జావేద్‌అన్సారీతో కలిసి ఆన్‌లైన్ వ్యభిచార దందాను నడిపించేందుకు ఓ వెబ్‌సైట్‌(లొకంటో.కామ్)లో ఫోన్ నెంబర్లను నమోదు చేసింది. ఇలా హైదరాబాద్ నుంచి సంప్రదించే విటులకు మాత్రమే ప్రాచీశర్మ యువతులను సరఫరా చేస్తుంది.

ఉపాధి పేరుతో అమ్మాయిలందరినీ ఢిల్లీ, హర్యానా, తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి హోటళ్లలో ఆశ్రయం కల్పిస్తుంది. ఆ తర్వాత వ్యభిచారం నిర్వహిస్తోంది. ఇలా ఒక్కో యువతికి ప్రాచీశర్మ రూ. 10వేల నుంచి 60 వేల వరకు ఛార్జీగా తీసుకుంటుంది. ఈ నగదులో 50శాతాన్ని తను తీసుకుని మిగతా మొత్తాన్ని యువతులకు ఇచ్చేస్తుంది.

Two Online sex rackets busted in Hyderabad

కాగా, హైదరాబాద్ నగరానికి చెందిన మరో ముఠా నాయకుడు ప్రభాకర్ ఓ వెబ్‌సైట్‌లో తన ఫోన్ నెంబరును నమోదు చేసుకున్నాడు. ఫోన్ ద్వారా సంప్రదించే విటులకు దేశవ్యాప్తంగా ఉన్న యువతులను సరఫరా చేస్తామని ఆకర్షణీయమైన ఫొటోలను చూపిస్తాడు. ఈ విధంగా విటులను ఆకర్షించి స్నేహితుల ద్వారా దందాను నడిపిస్తున్నాడు.

ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విటులకు కావాల్సిన వసతి సౌకర్యాన్ని కూడా ప్రభాకర్ కల్పిస్తూ చాలామందిని ఆకట్టుకుంటున్నాడు.

ఈ రెండు ముఠాలపై సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు నిఘా పెట్టి మంగళవారం అరెస్టు చేశారు. ఇందులో నిర్వాహకులు ప్రభాకర్, వి.నగేష్(బంజారాహిల్స్), రవివర్మ(బేగంపేట), ప్రాచీశర్మలను పోలీసులు అరెస్టు చేసి ఐదుగురు బాధిత యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. నిందితుల నుంచి 11 సెల్ ఫోన్లు, ఓ కారు, రూ. 32వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+