తెలంగాణలో కరోనా కలకలం: ఉస్మానియాలో ఇద్దరు మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కలవరానికి గురిచేస్తోంది. రోజు రోజుుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు, కొత్త వేరియంట్ కూడా విస్తరిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఏడాదిన్నర తర్వాత తొలి కరోనా మరణం తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది.
హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చేరిన రోగి మృతి చెందాడు. సమస్య తీవ్రం కావడం వల్లే రోగి మృతి చెందాడని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. అయితే, ఈ రోగికి చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నిర్ణారణ అయినట్లు చెప్పారు. మరోవైపు, ఇదే ఆస్పత్రిలో మరో వ్యక్తి కూడా కరోనా బారినపడి మరణించడం గమనార్హం.

మృతుల వయస్సు ఒకరిది 60 ఏళ్లు కాగా, మరొకరిది 42 సంవత్సరాలు. కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 10 కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 55కు చేరింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 45 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాలవారీగా తాజా కేసులను గమనించినట్లయితే.. రంగారెడ్డి జిల్లాలో 3, సంగారెడ్డిలో 2, ఖమ్మం-1, కరీంనగర్-1, వరంగల్ 2, మెదక్ 1 కేసులను గుర్తించారు. హైదరాబాద్ లో ఉన్న పాజిటివ్ కేసుల్లో.. ఫీవర్ ఆస్పత్రిలో 5 పాజిటివ్ కేసులు కాగా, చెస్ట్ ఆస్పత్రిలో 2, మిగితా కేసులు గాంధీ ఆస్పత్రిలో 10 కేసులున్నాయి. వీరిలో 8 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరో ఇద్దరు మృతి చెందారు.
కరోనా విస్తరిస్తున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, కేంద్ర ఆరోగ్య శాఖ తన బులిటెన్ లో తెలంగాణలో రెండు కరోనా కొత్త వేరియంట్ జెన్1 కేసులు నమోదైనట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, కొత్త వేరియంట్ కేసులు రాష్ట్రంలోలేవని డీహెచ్ స్పష్టతనిచ్చారు.
మరోవైపు, రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కరోనాను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఆక్సిజన్ సిలిండర్లను సరైన తీరుగా వినియోగించడం, పూర్తిస్థాయిలో వెంటిలేటర్లు పనిచేసేలా చేయడం వంటి విషయాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పరిధిలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లలో 16,500 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు, వాటితో పాటు రాష్ట్రంలో మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్ ల్యాబులు ఉన్నట్లు అధికారులు వివరించారు. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఆర్టీపీసీఆర్ కిట్లను అందజేయాలని మంత్రి రాజనర్సింహా ఆదేశించారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications