దారుణం: గర్ల్స్ హాస్టల్‌లో దుండగుల చొరబాటు, అసభ్య ప్రవర్తన

హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న దళిత అభివృద్ధి సంక్షేమ హాస్టల్‌లో గురువారం అర్ధారాత్రి ఇద్దరు దుండుగులు ప్రవేశించారు. హాస్టల్‌లో వార్డెన్ లేకపోవడంతో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు.

స్ర్కూ డ్రైవర్, కత్తులతో విద్యార్థినులను బెదిరించి కొందరి బట్టలు విప్పించి నానా హంగామా సృష్టించారు. పడుకుని ఉన్న పలువురు విద్యార్థినులు ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో బాలికలు అరుపులు, కేకలు పెట్టారు. దీంతో వారిని మీ తల్లిదండ్రులను కూడా చంపుతామని బెదిరింపులకు గురిచేసిన దుండగులు పరారయ్యారు.

తీవ్ర ఆందోళనకు గురైన బాలికలు తమకు రక్షణ కల్పించాలంటూ శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. దుండగుులు ముఖానికి గుడ్డలు కట్టుకుని వచ్చారని తెలిపారు. పలువురు విద్యార్థినులు ఆ ఘటనను వివరించుకుంటూ కన్నీటి పర్యాంతమయ్యారు.

Two persons mis behaved with girls in their hostel

హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు, విద్యార్థినుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కూకట్‌పల్లిలో విషాదం

నగరంలోని కూకట్‌పల్లి విషాద ఘటన చోటు చేసుకుంది. ఏడాది కుమారుడిని ఒంటరిగా వదిలేసి ఇద్దరు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో రెండ్రోజులుగా వారింట్లోనే ఏడాది బాలుడు ఏడ్చుకుంటూ ఉన్నారు. ఇరుగుపొరుగువారు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+