మా కుక్కల ఆచూకీ దొరికితే చెప్పండి..
హైదరాబాద్ : మనుషులు అదృశ్యమై రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ దొరకని ఈ రోజుల్లో తమ పెంపుడు జంతువుల ఆచూకీని తెలపాని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది ఓ బుల్లి తెర నటి.
తన పెంపుడు కుక్కలను వెతికి పెట్టాలని సికింద్రాబాద్ అల్వాల్ పోలీసులకు పిర్యాదు చేసింది బుల్లితెర నటి సంద్యామణి. వారం రోజుల క్రితం ఆమె ఓ వివాహా కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను బంధువుల ఇంటికి వెళ్ళింది.

సంద్యామణి ఊరికి వెళ్లే సమయంలో ఇంటి వాచ్ మెన్ కు కుక్కలను జాగ్రత్తగా చూడాలని కోరింది. ఆమె ఊరికి వెళ్ళిన రోజు రాత్రే రెండు పెంపుడు కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.
ఆమె మూడు కుక్కలను పెంచుతోంది.అయితే ఇందులో హని, మణి అనే రెండు కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్ళారు.ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుక్కల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.












Click it and Unblock the Notifications