వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరారీ
వరంగల్: వరంగల్ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున తప్పించుకున్నారు. ఘటనపై వరంగల్ జైలు డీఐజీ కేశవరావు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 2గంటల ప్రాంతంలో ఖైదీలు పరారయ్యారు. ఇందుకు వీరు తమ బెడ్ షీట్ ఉపయోగించారు.
బెడ్ షీట్ ను ఉపయోగించిన ఖైదీలు సెంట్రల్ జైలు ప్రహారీ గోడ ఎక్కి పారిపోయారు. ఇద్దరు ఖైదీల్లో ఒకరైన రాజేష్ యాదవ్ ఒక హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్నాడు. మరో ఖైదీ సైనిక్ సింగ్ కోర్టు ఆఫ్ మార్షల్స్‌లో ఖైదీ.

సైనిక్ సింగ్ గతంలో క్రాఫ్ట్ మన్‌గా విధులు నిర్వహించినట్లు డీఐజీ తెలిపారు. వీరిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వారే. వీరు గత రెండు నెలల క్రితం చర్లపల్లి జైలు నుంచి వరంగల్ జైలుకు తరలించబడ్డారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టినట్లు డీఐజీ తెలిపారు.












Click it and Unblock the Notifications