ఉత్తరాఖండ్‌లో హైదరాబాదీయులు దుర్మరణం
Hyderabad: ఉత్తరాఖండ్‌లో విషాదకర ఘటన సంభవించింది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడ దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని పోలీసుల ధృవీకరించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ నుంచి సమాచారం అందినట్లు వెల్లడించారు. వారి మృతదేహాలను స్వస్థలానికి తరలించనున్నట్లు చెప్పారు.
మృతులను నిర్మల్ షాహీ, సత్యనారాయణగా గుర్తించారు. వారిద్దరూ హిమాలయాలను సందర్శించడానికి ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. తమ పర్యటన భాగంగా బద్రీనాథ్ సహా ప్రఖ్యాత ఆలయాలను సందర్శించారు. అక్కడి నుంచి బైక్‌పై తిరుగుముఖం పట్టారు.

మార్గమధ్యలో చమోలీ జిల్లాలో ప్రమాదానికి గురయ్యారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై గౌచార్- కర్ణ ప్రయాగ్ సమీపంలోని గల ఛత్వాపీల్‌పల్ ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళ్తోన్న సమయంలో హఠాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. వాళ్లు ప్రయాణిస్తోన్న బైక్‌ను బండరాళ్లు ఢీకొట్టాయి.
ఈ ఘటనలో పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య చిక్కుకుని నిర్మల్ షాహీ, సత్యనారాయణ మృతిచెందారు. బైక్ మొత్తం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. బండరాళ్ల మధ్య చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.

కొంతకాలంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ సహా హిమాలయ పర్వత పంక్తుల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమర్‌నాథ్ యాత్రను సైతం నిలిపివేసింది. చమోలీ జిల్లాలో అసాధారణ వర్షపాతం నమోదవుతోంది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
గౌచార్, రుద్రప్రయాగ్, కర్ణ్ ప్రయాగ్, పీపల్‌కోటి, పాగల్‌నాలా, జోషిమఠ్, బద్రీనాథ్‌లల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. కాంచన్‌గంగ, హనుమాన్ ఛట్టీల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కుమౌన్, ఘర్వాల్ రీజియన్లల్లో మరో రెండు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications