హైదరాబాద్ ఫ్లైఓవర్లపై టూ వీలర్స్ నిషేధం, ఈ తేదీల్లోనే!

ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలో రెండు రోజులపాటు పలు ఫ్లైఓవర్లపై టూవీలర్లను నిషేధించారు. షాబ్-ఇ-ఖాదిర్ సందర్భంగా ఫ్లైఓవర్లపై నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మార్చి 27తోపాటు 28న రెండు రోజులపాటు పలు ఫ్లైఓవర్లపై టూవీలర్లను నిషేధించారు. రాత్రి 10 గంటల తర్వాత బైక్స్ ఈ ఫ్లైఓవర్లు ఎక్కితే చర్యలుంటాయని హెచ్చరించారు. షాబ్ ఇ ఖాదిర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Two-wheelers banned on Hyderabad flyovers on these dates only

టూవీలర్ల నిషేధం అమలులో ఉండే ఫ్లైఓవర్ల వివరాలు

బహదూర్ పుర ఫ్లైఓవర్ - జూపార్క్ 2వ గేట్ నుంచి దేవీ బాఘ్ వరకు
చాంద్రయాణగుట్ట ఫ్లైఓవర్- హుషామాబాద్ నయారా పెట్రోల్ బంక్ నుంచి పూల్ బాఘ్ డీఎల్ఆర్ఎల్ వరకు

డా. ఏపీజే అబ్దుల్ కలాం ప్లైఓవర్-పిసల్ బండ నుంచి లక్ష్మీరెడ్డి గార్డెన్ వరకు
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్-ఆరాంఘర్ నుంచి జూపార్క్ ఫ్లైఓవర్ వరకు

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని టూ వీలర్ బైక్స్ పై నిషేధాజ్ఞలను దృష్టిలో ఉంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏదైనా అంతరాయం కలిగితే 9010203626 అనే నెంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. ఇటీవల ఫ్లైఓవర్ పై యాక్సింట్స్ ఎక్కువయ్యారు. షాబ్ ఇ మెరాజ్ సందర్భంగా మాజ్, ఇమ్రాన్, అహ్మద్ అనే మైనర్లు రాష్ డ్రైవింగ్ చేస్తూ ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలో తమ పిల్లలు ప్రేయర్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చి వారిని స్టంట్స్ కు దూరంగా ఉండేలా చూడాలని పలువురు మత పెద్దలు పోలీసులను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+