సమావేశం రసాభాస: చెప్పులతో మహిళా కార్పోరేటర్ల వీరంగం

హైదరాబాద్: కరీంనగర్ కార్పోరేషన్ సమావేశం సోమవారం రసాభసాగా మారింది. శానిటేషన్, విగ్రహాల ఏర్పాటుపై ఈరోజు సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా డివిజన్ కాంట్రాక్టు పనుల విషయంలో ఇద్దరి మహిళా కార్పోరేటర్ల మధ్య గొడవకు దారితీసింది.

దీంతో ఇద్దరు టీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్లు పరస్పరం తిట్ల దండకాన్ని అందుకున్నారు. అంతేకాదు ఒకరి వార్డులో మరొకరు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు దూషణకు దిగారు. అంతటితో ఆగకుండా అంతటితో ఆగకుండా ఓ మహిళ కార్పొరేటర్ సహనం కోల్పోయి మరో కార్పొరేటర్‌కు చెప్పు చూపించారు.

Two Women Corporators War in Karimnagar Corporation Meeting

మేయర్ వారిద్దరినీ శాంతింప చేయడానికి ప్రయత్నించారు. తోటి కార్పోరేటర్లు మధ్యలో కలగజేసుకున్న ఇద్దరినీ వారించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా సరే వారిద్దరి మధ్య గొడవ సద్దుమణగలేదు. చివరకు సమావేశాన్ని వాయిదా వేశారు. మహిళా కార్పొరేటర్ల తీరుపై ఇటు అధికారులు, తోటి కార్పొరేటర్లు విస్తుపోయారు.

గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం

మియాపూర్‌లో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గుడిసెలు అగ్నికి ఆహుతై సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే, మియాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని అపార్ట్‌మెంట్ల సమీపంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గిరి, గుణ, శ్రీను, రాముల కుటుంబాలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

అయితే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేందుకు సిద్ధమైన వారంతా కొంత నగదు, దుస్తులు, నగలు సిద్ధంగా ఉంచుకుని సోమవారం ఉదయం పనులకు వెళ్లిపోయారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు గుడిసెలు కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కూకట్‌పల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+