ఐసిస్ కలకలం: చేతులు కలిపేందుకు వెళ్లిన యువకులు, అరెస్టు

వ‌రంగ‌ల్ కు చెందిన గుర్బాన్‌, హైద‌రాబాద్‌కు చెందిన హ‌బీబుల్ రెహ్మాన్‌ ఇద్దరు కలిసి ఐసిస్ లో చేరేందుకు హైదరాబాద్ నుంచి సిరియా వెళ్లారు.

హైదరాబాద్: నగరంలో మరోసారి ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) కలకలం రేగింది. ఉగ్రసంస్థతో చేతులు కలిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులను తెలంగాణ పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు. హైదరాబాద్ నుంచి నేరుగా సిరియా వెళ్లి అక్కడ ఐసిస్ తో పనిచేయాలని యువకులు ప్లాన్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Two youngsters from Telangana try to join ISIS, caught

వివరాల్లోకి వెళ్తే.. వ‌రంగ‌ల్ కు చెందిన గుర్బాన్‌, హైద‌రాబాద్‌కు చెందిన హ‌బీబుల్ రెహ్మాన్‌ ఇద్దరు కలిసి ఐసిస్ లో చేరేందుకు హైదరాబాద్ నుంచి సిరియా వెళ్లారు. విషయం పోలీసులకు తెలియడంతో వారు అప్రమత్తమయ్యారు. గుర్బాన్, హబీబుల్ రెహ్మాన్ లను చాకచక్యంగా సిరియా నుంచి వెనక్కి రప్పించగలిగారు.

వారిద్దరు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే తెలంగాణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు వారిని అప్పగించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+