హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఆఫీస్ వద్ద హోర్డింగ్ ఎక్కి హల్‌చల్, ప్లాన్‌తో దించారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తక్షణమే తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని లేదంటే టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరు నిరుద్యోగ యువకులు గురువారం నాడు హల్‌చల్ చేశారు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు.

వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ప్రభాకర్, ఖమ్మం జిల్లాకు చెందిన చైతన్య 2006లో ఇంటర్మీడియేట్‌లో క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఒకేషనల్ కోర్స్ పూర్తి చేశారు. అప్పటి నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఒకేషనల్ అభ్యర్థులకు సైతం ఉద్యోగాలు కల్పిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 428 అమలుకు నోచుకోకపోవడంతో తమలాంటి వేలాదిమంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు గురువారం సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట హోర్డింగ్ ఎక్కి హల్‌చల్ చేశారు. రెండు గంటల పాటు హైడ్రామా కొనసాగింది.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

తక్షణమే తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని లేదంటే టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరు నిరుద్యోగ యువకులు గురువారం నాడు హల్‌చల్ చేశారు.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. వారు కిందకు దూకితే గాయాలు కాకుండా ఉండేందుకు కింద టెంట్లు ఏర్పాటు చేసిన దృశ్యం.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

ఇటీవల వెలువడిన వ్యవసాయ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు తరలి వచ్చారు. చాలామంది అక్కడ గుమికూడారు.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

విద్యార్థుల హల్ చల్ గురించి తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అక్కడకు చేరుకొని వారితో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. న్యాయం చేయిస్తానని హామీ ఇచ్చారు.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

ఓ వైపు అలా మాట్లాడుతుండగా.. వారిని మాటల్లో పెడుతూ.. హోంగార్డు వెంకటయ్య, జగన్ అనే వ్యక్తిని ప్లాన్‌గా హోర్డింగ్ ఎక్కించారు. అప్పటికే తెప్పించిన క్రేన్ సాయంతో కిందకు దించారు.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

తక్షణమే తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని లేదంటే టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని ఇద్దరు నిరుద్యోగ యువకులు గురువారం నాడు హల్‌చల్ చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ప్రభాకర్, ఖమ్మం జిల్లాకు చెందిన చైతన్య 2006లో ఇంటర్మీడియేట్‌లో క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఒకేషనల్ కోర్స్ పూర్తి చేశారు. అప్పటి నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

ఒకేషనల్ అభ్యర్థులకు సైతం ఉద్యోగాలు కల్పిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 428 అమలుకు నోచుకోకపోవడంతో తమలాంటి వేలాదిమంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

యువకుల హల్‌చల్

యువకుల హల్‌చల్

సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట హోర్డింగ్ ఎక్కిన వారిని మాటల్లో పెడుతూ.. హోంగార్డు వెంకటయ్య, జగన్ అనే వ్యక్తిని ప్లాన్‌గా హోర్డింగ్ ఎక్కించారు. అప్పటికే తెప్పించిన క్రేన్ సాయంతో కిందకు దించారు.

English summary
Two youth climb hording near Telangana CM camp office on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X