ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ ను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి తాజాగా బెయిల్ లభించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పర్ పల్లి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సుమారు రెండు నెలలకు పైగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి జైలులో ఉన్నాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే విచారణ అనంతరం న్యాయస్థానం ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే దాదాపు 67 రోజుల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత ఆయనకు ఉప్పర్ పల్లి కోర్టు ఇవాళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఏం జరిగింది..?
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్న ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి.. అదే అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్న ఐపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జూలై 8న ఉదయ్ కృష్ణారెడ్డి తనను బలవంతంగా అతడి గదిలోకి లాక్కెళ్లి భయబ్రాంతులకు గురిచేసి తన ఫోన్ పాస్ వర్డ్ సేకరించాడని బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపించారు. అలాగే జూలై 9న కూడా మరోసారి తనను జుట్టు పట్టుకొని అతడి రూమ్ కు లాక్కెళ్లి మెడపై కత్తి పెట్టి బెదిరించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక తనతో ఆసభ్యకరంగా ప్రవర్తిస్తూ వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించాడని వెల్లడించారు. ఆ వీడియోలను తన భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు.

ఈ మేరకు ట్రైనీ మహిళ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ సమయంలో తనపై వచ్చిన ఆరోపణలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వస్తున్న ఫిర్యాదులు, వదంతులు నిరాధారమని.. అవి అవాస్తవమని, న్యాయం గెలుస్తుందని విశ్వసిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. అనంతరం తన బంధువుల ఇంటికి వెళ్లి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అయితే బంధువులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత పోలీసులు అతడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండి విధించగా చంచల్ గూడ జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications
