సొంత ఇలాకాలో షాక్: రేవంత్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

కొడంగల్: రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా స్పీకర్‌కు చేరి ఆమోదించాల్సి ఉంది. రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అయితే, ఇప్పటికే నేతలు కొడంగల్‌పై దృష్టి సారించారు.

Big Shock To Revanth Reddy రేవంత్‌కు బిగ్ షాక్ | Oneindia Telugu

అక్కడ భేటీ: కేసీఆర్-చంద్రబాబుల మధ్య రేవంత్ రెడ్డి చర్చ?

కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు

కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు

ముఖ్యంగా అధికార తెరాస ప్రభుత్వం ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా ఇతర పార్టీల నుంచి పార్టీలో చేర్చుకునేందుకు తాయిలాలతో దూకుడుగా ముందుకు సాగుతోందని తెలుస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన స్థానిక నాయకులను ఒకరొకరుగా అధికార పార్టీ తెరాసలోకి వరుస కడుతుండటంతో రేవంత్ వర్గానికి చుక్కెదురవుతోంది. ఓ విధంగా రేవంత్ వర్గానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని తెలుస్తోంది.

అప్పటి నుంచే ప్రారంభం

అప్పటి నుంచే ప్రారంభం

కాంగ్రెస్‌‌లో చేరిన రేవంత్ వెంటనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గానికి చెందిన అనుచరులు ఆయన వెంట ఉంటారని భావించారు. కానీ రేవంత్ పార్టీ మారుతారని ప్రచారం మొదలైనప్పటి నుంచే టీఆర్ఎస్‌లోకి నాయకులు వెళ్తున్నారు. తొలుత రేవంత్‌కు నమ్మినబంటుగా ఉన్న మద్దూర్‌ మండలానికి చెందిన ఎంపీపీ సంగీతశివకుమార్‌, జడ్పీటీసీ అనసూయబాల్‌సింగ్‌, బాల్‌సింగ్‌నాయక్‌ తదితరులు తెరాసలో చేరారు. అప్పటి నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రెండుమూడు విడతలుగా పలువురు నేతలు చేరారు.

నిరాశను కలిగిస్తోంది

నిరాశను కలిగిస్తోంది

దీంతో రేవంత్ ప్రధాన అనుచరులుగా భావిస్తున్న వారందరూ ఆయనను విడిపోతున్నారని ఆయన వర్గం కూడా ఆవేదనగా ఉందని తెలుస్తోంది. ఇది ఆయన వర్గంలో నిరాశను కలిగిస్తోందని అంటున్నారు.

అలా మంత్రాంగం నడిపించింది

అలా మంత్రాంగం నడిపించింది

రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని తెలియగానే రంగారెడ్డి జిల్లా మంత్రి, ఎమ్మెల్సీతో పాటు ఉమ్మడి జిల్లా మహబూబ్‌నగర్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను తెరాస అధిష్టానం రంగంలోకి దించింది. సాధ్యమైనంత ఎక్కువ మంది పార్టీలోకి వచ్చేలా వారు తెరవెనక మంత్రాంగం నడిపించింది. అభివృద్ధి తాయిలాలు కూడా ప్రకటించింది.

రేవంత్‌కు మింగుడుపడని విషయం

రేవంత్‌కు మింగుడుపడని విషయం


రేవంత్ అనుచరులుగా పేరొందిన పలువురు తర్జనభర్జనల మధ్య గులాబీ గుమ్మం తొక్కారు. ఓ విధంగా ఇది ఆయనకు మింగుడు పడని అంశమే అంటున్నారు. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు ఒకరొకరుగా తెరాసలోకి వెళ్తుండటంతో భవిష్యత్‌లో రేవంత్ అవకాశాలపై ప్రభావం చూపవచ్చునని భావిస్తున్నారు.

కొంతలో కొంత ఊరట

కొంతలో కొంత ఊరట

ఒక వేళ కొడంగల్‌కు ఉప ఎన్నిక వచ్చినా రేవంత్ గట్టి పోటీ ఇవ్వడానికి ఈ వలసలు దోహదపడతాయని తెరాస భావిస్తోంది. అయితే ఇటివల హైదరాబాద్‌కు వెళ్లి తెరాసలో చేరిన కొందరూ స్థానిక నేతలు మళ్లీ తిరిగి రేవంత్ దగ్గరికే వచ్చారని ఆయన వర్గీయులు అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Unhappy to Kodangal MLA Revanth Reddy on Kodangal issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి