త్వరలోనే మంత్రుల బాగోతం బయటకు.. బాంబు పేల్చిన కేంద్రమంత్రి బండి సంజయ్
కేసీఆర్ పై సీఎం చేసిన వ్యాఖ్యలు తప్పని, సీఎం పదవిలో ఉంటూ అలాంటి భాష వాడటం మంచిది కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సిఎం హోదాలో హుందాగా వ్యవహరించాలన్నారు. తెలంగాణా ప్రజలు సీఎం వ్యాఖ్యలపై చర్చిస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం సిగ్గు చేటు అని, ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పంచాయతీలకు సీఎం బిచ్చమేస్తున్నారా? బండి సంజయ్
పంచాయతీలకు సీఎం బిచ్చమేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఒక్కో పంచాయతీకి సగటున రూ.కోటి ఇవ్వాలని, కేంద్రం నుండి రూ.3 వేల 5 కోట్లు పంచాయతీలకు రాబోతున్నాయన్నారు.ముఖ్యమంత్రే ఈ విషయాన్ని ఒప్పుకున్నారని, అయినా మళ్లీ కేంద్రం ఏమిచ్చిందని ఎదురుదాడి చేయడం సిగ్గు చేటు అన్నారు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టే ఆదాయంతో 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదు చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.

ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రుల అక్రమాలపై రిపోర్టులు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నిరాశ, నిస్ప్రహల్లో ఉన్నారన్నారు. వారంతా తిరగబడే రోజులు వచ్చాయని, అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారన్నారు.కేబినెట్ లో ఇద్దరు, ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని వేల కోట్ల అక్రమాలు సంపాదిస్తున్నారన్నారు.ఇదే విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రుల అక్రమాలపై రిపోర్టులు తెప్పించుకుంటున్నాం అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపైనా నివేదికలు తెప్పించుకుని పంపినా చర్యల్లేవు
మంత్రుల భాగోతమంతా త్వరలోనే బయటపెడతామని, టైం చూసి కాంగ్రెస్ కరప్షన్, అక్రమాలపై బీజేపీ పోరాటం చేయబోతోంది అన్నారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపైనా నివేదికలు తెప్పించుకుని పంపినా చర్యల్లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల స్కాం జరిగితే... 9 వేల కోట్ల అక్రమాలపైనే విచారణకు పరిమితం ఎందుకు చేశారు? అని పేర్కొన్నారు. ఎవరిని కాపాడేందుకు రూ.లక్ష కోట్ల అక్రమాలపై విచారణ జరపడం లేదు? అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ ను తలపిస్తోంది
తాను కాంగ్రెస్లోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పినా స్పీకర్ ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ అన్నారు. సుమోటోగా తీసుకుని దానంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు చెప్పాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ ను తలపిస్తోందన్నారు.ప్రభాకర్ రావు ఎంతోమంది జీవితాలను నాశనం చేశారన్నారు. కేసీఆర్ సర్కార్ బాటలోనే రేవంత్ పాలన కొనసాగుతోంది. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ సర్కార్ కూడా జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా పోటీ
6 గ్యారంటీలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తున్నారన్నారు.కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి జరిగేదని ప్రజల్లో చర్చ జరుగుతోందని అన్నారు. ఈసారి జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గా పోటీ చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం తథ్యం అన్నారు.
కేసీఆర్ కుటుంబం కంటే తెలంగాణాలో పెద్ద శని లేదు
కేసీఆర్ కుటుంబం కంటే పెద్ద శని తెలంగాణలో లేదన్నారు. తెలంగాణను సర్వనాశనం చేసిన కుటుంబం కేసీఆర్ దేనని ఆయన అన్నారు. ప్రజలు గమనించే కేసీఆర్ ను ఫాంహౌజ్ కే పరిమితం చేశారన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకొకరు బాగుపడలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటే... ముమ్మాటికీ దోషి కేసీఆరే అని బండి సంజయ్ పేర్కొన్నారు.
కేసీఆర్ చేసింది జగన్ స్వయం గా చెప్పాడన్న కేంద్ర మంత్రి
575 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు చాలు అని అంగీకరించిన వ్యక్తి కేసీఆరే అని, అపెక్స్ కమిటీ సమావేశంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డే ఈ విషయం చెప్పారన్నారు. దీనిపై అవసరమైతే నాటి ఒప్పందాలను బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు












Click it and Unblock the Notifications