ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి: అబ్జర్వేషన్‌లో..
న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గుండె సంబంధిత ఇబ్బందులకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనను అబ్జర్వేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో మొన్నటివరకు జీ కిషన్ రెడ్డి హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో విస్తృతంగా పర్యటించారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ రైలును ఆయన సికింద్రాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. గంగా పుష్కరాలు, పూరీ-కాశీ-అయోధ్యను సందర్శించడానికి ఉద్దేశించిన రైలు ఇది. పార్టీ సమావేశాలకు హాజరయ్యారు. తీరికలేని షెడ్యూళ్లలో గడిపారు.

అనతరం ఢిల్లీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత స్వల్పంగా గుండెనొప్పికి గురయ్యారు. గుండె సంబంధిత ఇబ్బందులు తలెత్తాయి. దీనితో ఆదివారం రాత్రి 10:30 గంటలకు హుటాహుటిన ఆయనను ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు తరలించారు. ఎయిమ్స్‌లోని క్రిటికల్ కార్డియాక్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం కిషన్ రెడ్డి డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెబుతున్నారు. అబ్జర్వేషన్ అనంతరం ఈ సాయంత్రానికి ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీరిక లేని షెడ్యూల్స్ గడపడం, విశ్రాంతి లేకపోవడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయిందని, ఫలితంగా గుండె సంబంధిత ఇబ్బందులు తలెత్తినట్లు చెబుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications