తెలుగు ప్రజలకు మరో రైలు: మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ షురూ, టైమింగ్స్ ఇవే
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మద్య మరో కొత్త రైలు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్-విశాఖట్నం ఎక్స్‌ప్రెస్(12862) రైలును శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలన్నారు.
వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అవసరమన్నారు. త్వరలో ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ను షాద్‌నగర్‌లో ఆపాలని స్థానికులు కోరారని.. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మహబూబ్‌నగర్-విశాఖట్నం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కాగా, మహబూబ్‌నగర్-విశాఖ 12861, 12862 రైళ్ల రాకపోకల వల్ల ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రాంతాల ప్రజలు సులభంగా ప్రయాణాలు చేయవచ్చు. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లా ప్రజలు జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం ప్రాంతాల మధ్య రాకపోకలు కొనసాగుతాయి. ఈ అవకాశాలతో పాటు ఇరు ప్రాంతాల ప్రజలు విజ్ఞాన విహారయాత్రలు చేసుకోవడానికి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి.
Live: Flagging off the extension of Train services of Vishakhapatnam-Kancheguda-Vishakhapatnam (T. No. 12862) to Mahabubnagar, Telangana. https://t.co/ZdhDBRIUUc
— G Kishan Reddy (@kishanreddybjp) May 20, 2023
ప్రతిరోజు సాయంత్రం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి నాలుగు గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది. స్టాప్ ఉన్న ప్రతి కేంద్రంలోనూ ఒక నిమిషం మాత్రమే నిలిచి ఆ తర్వాత బయల్దేరుతుంది. ముఖ్యమైన స్టేజీల వద్ద పది నిమిషాల వరకు ఆగుతుంది. మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఛార్జీలు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ఉన్నాయి. మహబూబ్‌నగర్ నుంచి రైలు ప్రారంభం కావడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కార్యక్రమం సందర్భంగా అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. జై శీనన్న అని బీఆర్ఎస్ శ్రేణులు అంటే.. కిషన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, జై బీజేపీ అంటూ ఆ పార్టీ శ్రేణులు నినాదాలు చేశాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications