హైదరాబాద్: తీగ తెగి పడిన లిఫ్ట్, కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలకు తృటిలో ముప్పు తప్పింది. వారు ఎక్కిన లిఫ్ట్ వైరు తెగిపోవడంతో లిఫ్ట్ మొదటి అంతస్థు నుంచి కిందికి పడిపోయింది.
అందులో కేంద్రమంత్రి జెపి నడ్డా, ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారంనాడు లక్ష్మణ్ బాధ్యతలు తీసుకున్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంక్యనాయుడు, దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.

శుక్రవారం సాయంత్రం లక్ష్మణ్‌ను అభినందించేందుకు కేంద్రమంత్రులు నిర్మాలా సీతారామన్, నడ్డా తదతరులు వచ్చారు. వీరంతా కలిసి లిఫ్ట్ ఎక్కగానే వైర్ తెగి కిందకు పడిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
సామర్థ్యానికి మించి వారు ఎక్కడం వల్లనే లిఫ్ట్ వైర్ తెగిపోయిందని అంటున్నారు. ఏమైనా, బిజెపి నేతలు సురక్షితంగా బయటపడ్డారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications