మెట్రోరైలు: పిల్లర్లతో అడ్రస్, జీపీఎస్, గూగుల్ మ్యాప్‌తో లింక్
హైదరాబాద్: మెట్రో రైలులో ప్రయాణంతో క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకోవడమే కాదు మరో సౌలభ్యం కూడ ఉంది. మెట్రో పిల్లర్లకు ఏర్పాటు చేసిన నెంబర్ల ఆధారంగా సులభంగా అడ్రస్‌ను కనుక్కొనే వెసులుబాటు దక్కనుంది.
హైద్రాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ నవంబర్ 28వ, తేది మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభించనున్నారు. మెట్రో రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
Recommended Video

హైద్రాబాద్ మెట్రో రైలు సేవలు నవంబర్ 28వ, తేది నుండి అందుబాటులోకి రానున్నాయి. అయితే మెట్రో రైలులో ప్రయాణం చేయాలంటే మెట్రో ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసిన సూచనలను పాటించాల్సిందే.మెట్రో ఇచ్చిన సూచనలను పాటించకపోతే జైలు శిక్ష తప్పదు.

మెట్రో పిల్లర్ల సహయంతో అడ్రస్
హైద్రాబాద్ మెట్రో రైలు ద్వారా క్షణాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకొనే సౌకర్యంతో పాటు అడ్రస్ తెలుసుకొనే అవకాశం కూడ దక్కింది. మెట్రో రైలు ప్రయాణించే మార్గంలో అడ్రస్ కోసం కుస్తీ పడాల్సిన పనిలేదు. ఫలానా చిరునామా కోసం ప్రతి ఒక్కరిని కూడ అడగాల్సిన పని కూడ లేదు. మెట్రో పిల్లర్లకు ఏర్పాటు చేసిన నెంబర్ల ఆధారంగా అడ్రస్‌ను కనుక్కోవచ్చు.

మెట్రొ పిల్లర్లకు యూనిక్ నెంబర్లు
మెట్రో పిల్లర్లకు యూనిక్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్లను గూగుల్ మ్యాప్‌తో పాటు జిపిఎస్‌తో అనుసంధానం చేశారు. దీని ద్వారా సులభంగా మెట్రోలో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులు సులభంగా తాము ప్రయాణం చేస్తున్న ప్రాంతం వివరాలను తెలుసుకొనే వెసులుబాటు దక్కనుంది ఇంటర్నెట్ సహయంతో తాము ఏ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నామో తెలుసుకోవచ్చు. లేదా టీ సవారీ యాప్ ఉంటే పని మరింత సులభం కానుంది.

కారిడార్ల వారీగా నెంబర్లు
మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్, నాగోల్ నుంచి అమీర్‌పేట కారిడార్లలో పిల్లర్ల నిర్మాణం పూర్తైంది. నవంబర్ 28వ, తేదిన మెట్రో రైలు తొలి దశ పనులు జాతికి అంకితం కానున్నాయి. అయితే మెట్రో పిల్లర్లకు యూనిక్ నెంబర్లను కేటాయించారు. మియాపూర్ తొలి పిల్లర్ కు ఎంవైపీ-01/ఏ అని ఉంటుంది. రెండో పిల్లర్ కు ఎంవైపీ-02/ఏ ఉంటుంది. ఈ నెంబర్ల ఆధారంగా అడ్రస్‌ను సులభంగా గుర్తించవచ్చు.

మెట్రో రైల్వే స్టేషన్లలో సమాచారం
మెట్రో రైల్వే స్టేషన్లలో సమీపంలోని కాలనీలు, గృహ సముదాయాలకు సంబంధించిన సమాచారాన్ని బోర్డుల రూపంలో ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఏర్పాటు చేశారు.అంతేకాదు బస్‌స్టేషన్లు, ఆటో స్టాండ్‌ల వంటి రవాణా సదుపాయాల సమాచారాన్ని కూడ పొందుపర్చారు.ఈ సమాచారం ఆధారంగా మెట్రో రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే తమ ప్రాంతాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications