కూకట్‌పల్లిలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌పై కత్తితో దాడి
హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. సాప్ట్‌వేర్ ఇంజనీర్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివారాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి కూకట్ పల్లిలోని బాలాజీ నగర్‌లో నివాసం ఉండే వెంకట నరసింహారావు మాదాపూర్‌లో విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు.
ఇంటిలో తన ద్విచక్ర వహనాన్ని పార్కింగ్ చేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో తలపై దాడి చేశాడు. ఆ సమయంలో స్ధానికులు అతడి కోసం గాలించినా తప్పించుకొని పారిపోయాడు. వెంటనే నర్సింహారావును కూకట్ పల్లిలోలని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కత్తితో దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు చర్యలు చేపట్టారు.













Click it and Unblock the Notifications