వర్ష బీభత్సం: వడగళ్లు, రోడ్లు జలమయం(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. అల్పపీడణ ద్రోణి కారణంగా కురిసిన అకాల వర్షంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లోని రహదార్లు జలమయమయ్యాయి. తెల్లవారుఝాము మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

మెట్రోరైలు పనులు వేగవంతంగా జరుగుతున్న లక్డీకాపూల్, బేగంపేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, నల్గొండ క్రాస్‌రోడ్డు, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షానికి బలమైన ఈదురుగాలులు కూడా తోడు కావటంతో కాచిగూడ సమీపంలోని బర్కత్‌పురా, అంబర్‌పేట, మాసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.

తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవటంతో మరోసారి నగరంలోని కాలువలు, డ్రైనేజీలు పొంగి ప్రవహించటంతో భారీగా మురుగునీరు రోడ్లపైకి చేరింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో భారీగా కురుస్తున్న అకాల వర్షాలు మరో రెండురోజుల పాటు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ హెచ్చరించటంతో జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

నగరంలో సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

అల్పపీడణ ద్రోణి కారణంగా కురిసిన అకాల వర్షంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లోని రహదార్లు జలమయమయ్యాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

తెల్లవారుఝాము మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

మెట్రోరైలు పనులు వేగవంతంగా జరుగుతున్న లక్డీకాపూల్, బేగంపేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, నల్గొండ క్రాస్‌రోడ్డు, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

ఈ వర్షానికి బలమైన ఈదురుగాలులు కూడా తోడు కావటంతో కాచిగూడ సమీపంలోని బర్కత్‌పురా, అంబర్‌పేట, మాసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవటంతో మరోసారి నగరంలోని కాలువలు, డ్రైనేజీలు పొంగి ప్రవహించటంతో భారీగా మురుగునీరు రోడ్లపైకి చేరింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో భారీగా కురుస్తున్న అకాల వర్షాలు మరో రెండురోజుల పాటు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ హెచ్చరించటంతో జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

మ్యాన్‌హోల్స్, వరద నీటి కాలువలు, నాలాల వద్ధ ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బందిని నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+