యువతులతో శృతిమించిన డ్యాన్స్, ఫాంహౌస్‌లలో అరాచకం
హైదరాబాద్: నగర శివారు ప్రాంతాల్లోని పాంహౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాదులోని హోటళ్లు, లాడ్జిలపై నిఘా పెరుగుతుండటంతో కొందరు ఫాంహౌస్‌ల వైపు దృష్టి సారించారు. విందుల నుంచి మొదలు రేవ్ పార్టీల వరకు సాగుతున్నాయి.
Recommended Video

రేవ్ పార్టీలు, బర్త్ డే పార్టీల పేరుతో అర్ధరాత్రి యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు, మద్యం, హుక్కా మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఫాంహౌస్‌లు దూరంగా ఉంటాయి. దీంతో ఏం జరిగినా పోలీసులు అక్కడకు చేరుకోవడానికి సమయం తీసుకుంటుంది.

పలుమార్లు పట్టుబడ్డారు
ఇటీవల ఫాంహౌస్‌లలో పలుమార్లు అర్ధరాత్రి పూట యువతులతో అర్ధనగ్న డ్యాన్సులతో చేయిస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటనలు స్థానికులను ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నాయి. ఫాంహౌస్‌లలో పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు పెట్టి అర్ధరాత్రి వరకు కొనసాగిస్తుంటారు. ఇవి స్థానిక ప్రజలకు ఇబ్బందులు తెస్తున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో వారితో గొడవలు కూడా జరుగుతున్నాయి.

శృతి మించుతున్నాయి
ఫాంహౌస్ యజమానులు తమ ఆదాయం కోసం వాటిని విందు, వేడుకలకు అద్దెకు ఇస్తున్నారని అంటున్నారు. అయితే వీరు మాత్రం బర్త్ డే పార్టీ వంటి పేర్లతో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఇవి శృతి మించుతున్నాయి.

పోలీసుల నిఘా
ముఖ్యంగా పాతబస్తీకి చెందిన కొన్ని ముఠాలు పాంహౌస్‌లలో జరిగే పార్టీలకు అన్ని సరఫరా చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పోలీసులు, ఉన్నతాధికారులు అందరిపై దృష్టి పెడుతున్నారు.

అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతుండటంతో
ఇదిలా ఉండగా, ఫాంహౌస్‌లలో క్రమంగా ఇలాంటి చర్యలు పెరుగుతుండటంతో నేరాల నియంత్రణకు పోలీసులు ఉద్యుక్తులవుతున్నారు. ఫాంహౌస్‌లపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా విందులు చేసుకోవాలంటే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని అంటున్నారు. ఈ మేరకు ఫాంహౌస్ యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications