వాటర్‌గ్రిడ్‌ బాగుంది, మాకూ చెప్పండి: కెటిఆర్‌కు యూపీ సీఎం అఖిలేష్ ఆహ్వానం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ గొప్ప పథకమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రశంసించారు. ఈ పథకం అమలుపై తన అధికారుల ద్వారా పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న అఖిలేశ్.. దాని తీరు తెన్నులతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తాగునీటిని అందించేందుకు జలహారం పథకాన్ని పెద్దఎత్తున చేపట్టినందుకు పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావుని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ అభినందించారు.

UP CM Akhilesh praises TS Govt's water grid project,invites KTR to UP

వాటర్‌గ్రిడ్ పథకంపై తమకు తెలంగాణ ఇంజినీర్ల ద్వారా తెలియజేయాలని మంత్రి కేటీఆర్‌ను అఖిలేశ్ కోరారు. ఇందుకోసం అక్టోబర్ 15న యూపీకి రావాలని మంత్రి కేటీఆర్ బృందానికి ఆహ్వానం పలికారు.

తాగునీటి రంగంలో వాటర్ గ్రిడ్ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అఖిలేశ్ అన్నారు.అయితే ముందు స్వయంగా వచ్చి పథకం అమలుతీరును పరిశీలించాలని అఖిలేశ్ యాదవ్‌ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.

ఈ పథకం అమలుతో దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని అఖిలేశ్‌కు వివరించారు. తమకు తెలంగాణ వాటర్‌గ్రిడ్‌పై పూర్తి సమాచారం ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందని.. త్వరలో తెలంగాణలో పర్యటిస్తామని అఖిలేశ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+