శోభనం గది నుంచి గాయాలతో బయటకొచ్చిన నవ వరుడు... జరిగింది తెలిసి షాక్ తిన్న కుటుంబం...

ఆ కొత్త జంటకు అది మొదటి రాత్రి... అందరి లాగే ఆ నవ వరుడు అదో మరుపురాని జ్ఞాపకంలా మిగిలిపోవాలనుకున్నాడు. కానీ ఆ రాత్రి అతనికి కాళరాత్రిలా మిగిలిపోయింది. శోభనం గదిలో అడుగుపెట్టాక ఆ నవ వధువు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. ఇనుప రాడ్డుతో భర్తను ఎడాపెడా చావబాదింది. ఆపై నగదు,నగలతో ఇంటి నుంచి ఉడాయించింది. శోభనం గది నుంచి గాయాలతో బయటకొచ్చిన అతన్ని చూసి అతని కుటుంబం షాక్ తిన్నది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని జిజ్నోర్‌లో ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

ఉత్తరప్రదేశ్‌లోని కుందా కుర్ద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చాలాకాలంగా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పెళ్లిళ్ల బ్రోకర్ ఓ సంబంధం తీసుకొచ్చాడు. అమ్మాయి,అబ్బాయి ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి ఖాయం చేసుకున్నారు. మార్చి 15న కుందా కుర్ద్ జిల్లాలోని బిజ్నోర్‌లో వీరి వివాహం జరిగింది. ఎట్టకేలకు తన పెళ్లయిందని... ఇక జీవితంలో స్థిరపడ్డానని ఆ వరుడు సంతోషించాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.

శోభనం గదిలో భర్తపై విచక్షణారహితంగా దాడి...

శోభనం గదిలో భర్తపై విచక్షణారహితంగా దాడి...

పెళ్లి తంతు ముగిశాక వరుడితో కలిసి వధువు మెట్టినంట అడుగుపెట్టింది. అదే రోజు రాత్రి కొత్త జంటకు శోభనం జరగాల్సి ఉంది. తన భార్యతో మొదటిరాత్రి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోవాలని వరుడు కలలు కన్నాడు. కానీ శోభనం గదిలో అడుగుపెట్టాక అంతా తలకిందులైంది. ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ నవ వధువు అతనిపై ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేసింది. అనంతరం రూ.20వేలు నగదు,రూ.2లక్షలు విలువ చేసే నగలతో ఇంటి నుంచి ఉడాయించింది. శోభనం గది నుంచి వరుడు తీవ్ర గాయాలతో బయటకు రావడంతో అతని కుటుంబం షాక్ తిన్నది.

ఆస్పత్రిలో వరుడు...

ఆస్పత్రిలో వరుడు...

కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆపై పారిపోయిన వధువుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై వరుడు మాట్లాడుతూ...'అసలేం జరిగిందో నాకు కూడా అర్థం కాలేదు. ఇనుప రాడ్డుతో నా భార్య నాపై దాడి చేయడంతో సొమ్మసిల్లి పడిపోయాను. ఆ తర్వాత స్పృహలోకి వచ్చాక ఆ గది నుంచి బయటకొచ్చి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పాను.' అని తెలిపాడు. ఇటీవలే ఇదే ఉత్తరప్రదేశ్‌లోని షాజహన్‌పూర్‌లోనూ ఈ ఘటన చోటు చేసుకుంది. నవ వధువు పెళ్లయిన 5గంటలకే నగలు,నగదుతో ఉడాయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+