బతుకమ్మ వేడుకల్లో స్టెప్పులేసిన ఉపాసన
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వైభవం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో మెరిసింది. ప్రముఖ నటుడు రామ్‌చరణ్ సతీమణి, బిజినెస్ ఉమెన్ ఉపాసన కొణిదెల ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ,తెలుగు విద్యార్థులతో కలిసి ఉల్లాసంగా బతుకమ్మ ఆడారు.
ఢిల్లీలోని రాంజాస్ కాలేజీలో తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో శనివారం ఈ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథులుగా హాజరైన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉపాసన కొణిదెల... ఉత్సాహంగా విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతిని సగర్వంగా చాటుతూ, సాంప్రదాయ దుస్తుల్లో ఉపాసన చేసిన సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బతుకమ్మ వేడుకల అనంతరం ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఈ వేడుకల గురించి పంచుకున్నారు.ఈ పండుగ కాలంలో మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న దేవిని సత్కరించుకొని, మన బలాన్ని కలిసి జరుపుకుందాం అని ఆమె పేర్కొన్నారు.
Thank you, @gupta_rekha Ji and the students of Ramjas College, Delhi, for embracing & celebrating Telangana culture with such love & respect.
— Upasana Konidela (@upasanakonidela) September 28, 2025
This festive season, let’s honor the Devi within each of us & celebrate our strength together.
బతుకమ్మ శుభాకాంక్షలు, नवरात्रि की… pic.twitter.com/OhFxYwQv72
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు ఒక అద్భుతమైన సీఎం... తెలంగాణ సంస్కృతిని ఆప్యాయంగా ఆహ్వానించి, బతుకమ్మ పండుగను మాతో కలిసి జరుపుకున్నందుకు ధన్యవాదాలని ఉపాసన ట్వీట్ చేశారు. రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశ రాజధానిలో బతుకమ్మ పండుగ వైభవాన్ని చాటిన ఈ వేడుకలు, తెలంగాణ సంస్కృతికి దక్కిన గౌరవంగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications